MI vs DC match: ఢిల్లీని చిత్తుగా ఓడించి ఆరోసారి ఫైనల్‌కి చేరిన ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా గురువారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ( Delhi Capitals ) 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

Last Updated : Nov 6, 2020, 12:25 AM IST
MI vs DC match: ఢిల్లీని చిత్తుగా ఓడించి ఆరోసారి ఫైనల్‌కి చేరిన ముంబై ఇండియన్స్

దుబాయ్‌: ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా గురువారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ( Delhi Capitals ) 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో 13 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌‌కి చేరిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది.

Also read : IPL 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ నెగ్గుతుంది: హార్దిక్‌ పాండ్యా

201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లంతా ఆరంభంలోనే తడబడ్డారు. ముంబై బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా ( Jasprit Bumrah 4/14), బౌల్ట్‌ ( Trent Boult 2/9) తీవ్ర కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143  పరుగుల వద్దే చాపచుట్టేసింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఓపెనర్స్ పృథ్వీ షా (0), శిఖర్‌ ధావన్‌ Shikhar Dhawan (0)తో పాటు మూడో బ్యాట్స్‌మేన్ అజింక్య రాహానె (0) డకౌటవడంతోనే ఢిల్లీ జట్టు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో పృథ్వీ షా, అజింక్య రహానె ఔట్ కాగా ఆ తర్వాతి ఓవర్లోనే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించని పృథ్వీ షాపై ముందు నుంచీ అంతగా ఆశలు లేకపోయినా.. పూర్తి ఫామ్‌లో ఉండి రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు చేసిన శిఖర్ ధావన్‌పై జట్టు చాలా ఆశలే పెట్టుకుంది. ధావన్‌కి రహానే తోడు ఉంటాడనుకుంటే.. మూడు వికెట్లు టపాటపా పడటంతో మ్యాచ్ వన్ సైడ్ వార్ అయిపోయింది. 

Also read : IPL 2020 Playoff: RCB ఈసారి కూడా టైటిల్‌ కొట్టేలా లేదు: మాజీ కెప్టెన్

అనంతరం క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ( Shreyas Iyer (12)‌ కూడా బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో షాట్‌‌కి ప్రయత్నించి కవర్‌లో అడ్డంగా రోహిత్‌ శర్మ ( Rohit Sharma ) చేతికి దొరికిపోయాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 పరుగులకే నాలుగు వికెట్లు సమర్పించుకుంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో చివర్లో మార్కస్‌ స్టొయినీస్‌ ( Marcus Stoinis 65), అక్షర్‌ పటేల్‌ ( Axar Patel 42) పోరాడినప్పటికీ అప్పటికే పరిస్థితులు చేజారిపోవడంతో వారికి ఓటమి తప్పలేదు. 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌లో సూర్య కుమార్ యాదవ్‌ ( Surya Kumar Yadav 51: 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ ( Ishan Kishan 55 నాటౌట్‌: 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. క్వింటన్‌ డికాక్‌ ( Quinton De kock 40: 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌) ఆకట్టుకునే ప్రతిభ కనబర్చాడు. ఆఖర్లో హార్డిక్‌ పాండ్య ( Hardik Pandya 37 నాటౌట్‌: 14 బంతుల్లో 5 సిక్సర్లు) చెలరేగిపోవడంతో స్కోర్ బోర్డులో ఇంకొంత వేగం పెరిగింది. సమష్టికృషితో ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. మొత్తానికి ఐపిఎల్ 2020లోనూ ముంబై ఇండియన్స్ తమ దూకుడును కొనసాగించింది.

Also read : Marlon Samuels: 2 వరల్డ్ కప్‌ల విన్నర్ క్రికెట్‌కు వీడ్కోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News