/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

India beat Australia in T20 World Cup 2022 Warm-up Match: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లో టీమిండియా పేసర్ మొహ్మద్ షమీ నాలుగు వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి నాలుగు బంతుల్లో 7 రన్స్ చేయాల్సిన సమయంలో ఒక్క రన్ ఇవ్వకుండా నాలుగు వికెట్స్ తీశాడు.  

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (35) బౌండరీలతో రెచ్చిపోవడంతో ఆసీస్ కోర్ బోర్డు 10 పరుగుల రన్ రేట్‌తో పరుగులు పెట్టింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (79) మాత్రం ఆచితూచి ఆడాడు. మార్ష్ అనంతరం స్టీవ్ స్మిత్ (11), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23) ధాటిగా ఆడి ఔట్ అయ్యారు. ఓ వైపు వికెట్స్ పడుతున్నా ఫించ్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ బాదాడు. 

చివరి రెండు ఓవర్లలో ఆసీస్ 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ఫోబియాగా మారిన 19వ ఓవర్‌ను హర్షల్‌ పటేల్ అద్భుతంగా వేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఫించ్‌ వికెట్‌ పడగొట్టాడు. విరాట్ కోహ్లీ చేసిన సూపర్ త్రో దెబ్బకు టిమ్‌ డేవిడ్‌ (5) కూడా రనౌట్‌ అయ్యాడు. దాంతో దీంతో చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 11 రన్స్ అవసరం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన మొహ్మద్ షమీ తొలి రెండు బంతులకు 4 రన్స్ ఇచ్చాడు. మూడో బంతికి పాట్ కమిన్స్‌ (4) ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో అద్భుతంగా పట్టాడు.

నాలుగో బంతికి ఆష్టన్ అగర్ (0)ను కీపర్, బౌలర్ కలిసి రనౌట్ చేశారు. తర్వాత వేసిన అద్భుతమైన యార్కర్‌కు స్పెషలిస్ట్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ రిచర్డ్‌సన్‌ను కూడా సూపర్ యార్కర్‌తో చివరి బంతికి మొహ్మద్ షమీ అవుట్ చేశాడు. దీంతో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్‌ కుమార్ 2 వికెట్స్ తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 

Also Read: ICC T20 World Cup: క్రికెట్‌ ప్రపంచమా.. నమీబియా పేరు గుర్తుపెట్టుకో: సచిన్‌

Also Read: ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్స్.. శ్రీలంక జట్టుపై పేలుతున్న జోకులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Section: 
English Title: 
Mohammed Shami 4 Wickets, KL Rahul Fifty help India beat Australia in T20 World Cup 2022 Warm-up Match
News Source: 
Home Title: 

IND Vs AUS: చివరి 4 బంతుల్లో నాలుగు వికెట్స్.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం!

IND Vs AUS: చివరి 4 బంతుల్లో నాలుగు వికెట్స్.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

చివరి 4 బంతుల్లో నాలుగు వికెట్స్

ఆస్ట్రేలియాపై భారత్ విజయం

ఒక్క రన్ ఇవ్వకుండా నాలుగు వికెట్స్

Mobile Title: 
IND Vs AUS: చివరి 4 బంతుల్లో నాలుగు వికెట్స్.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Monday, October 17, 2022 - 13:26
Request Count: 
69
Is Breaking News: 
No