ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనగానే గుర్తొచ్చే అతికొద్ది మంది క్రికెటర్లలో ప్రవీణ్ తాంబే ఒకడు. ఎందుకంటే ఐపీఎల్‌లో అతిపిన్న వయసు క్రికెటర్లతో పాటు అత్యధిక వయసు ప్లేయర్ల పేరు క్రికెట్ ప్రేమికుల నోట్లలో నానుతుంటుంది. ప్రవీణ్ తాంబే వయసు 48ఏళ్లు. అయినా ఏ ఇబ్బంది లేకుండా ఆటను ఆస్వాదిస్తున్నాడు ఈ వెటరన్ ప్లేయర్. కాగా, తాజా ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రవీణ్ తాంబే అనర్హుడయ్యాడు. బీసీసీఐ కమిటీ అధికారి ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇటీవల అబుదాబిలో జరిగిన టీ10 ఫార్మాట్ లీగ్‌లో తాంబే ప్రాతినిథ్యం వహించాడు. అయితే విదేశీ లీగ్‌లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం సమర్పించి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బీసీసీఐ అనుమతి లేకుండానే విదేశీ లీగ్‌లో ఆడిన కారణంగా ప్రవీణ్ తాంబే ఐపీఎల్ 2020లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. బీసీసీఐ నియమాలను ఉల్లంఘించిన తాంబేను ఈ ఐపీఎల్‌లో ఆడేందుకు బోర్డు అనుమతించదని తేలిపోయింది.
Also Read: T20 World Cup భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్
కాగా, 41 ఏళ్ల వయసులో 2013లో తాంబే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి రికార్డులు తిరగరాశాడు. లీగ్‌లో అత్యధిక వయసు క్రికెటర్ అయిన తాంబే.. ఇప్పటివరకు ఐపీఎల్ లీగ్‌లో 33 మ్యాచ్‌లాడి 28 వికెట్లు సాధించాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో కనిష్ట ధర రూ.20 లక్షలకే కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాంబేపై వేటు పడటంతో కేకేఆర్ ఓ సీనియర్ బౌలర్ సేవల్ని కోల్పోనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఐపీఎల్ స్పెషల్ క్రికెటర్‌కు BCCI షాక్!