Kolkata Knight Riders Vs Mumbai Indians Playing XI Dream11 Team Tips: ఐపీఎల్లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. కేకేఆర్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో దాదాపు బెర్త్ ఖాయం చేసుకోగా.. ముంబై టాప్-4లో నిలిచే ఛాన్స్ ఎప్పుడో కోల్పోయింది. కోల్‌కతా ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఇక ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు, 8 పాయింట్లతో కింద నుంచి రెండోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో అయినా గెలిచి టోర్నీ నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించాలని ముంబై ఇండియన్ చూస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
హెడ్ టు హెడ్ రికర్డుల విషయానికి వస్తే.. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మొత్తం 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 23 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించగా.. కోల్‌కతాతో పదింటిలో గెలుపొందింది. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. మరోసారి హైస్కోరింగ్ మ్యాచ్‌గా సాగే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఏడో మ్యాచ్‌కు అతిథ్యం ఇస్తోంది. ఈ పిచ్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు దాదాపు 200 పరుగులు కాగా.. ఈ సీజన్లో కేకేఆర్‌పై 262 పరుగులను పంజాబ్ కింగ్స్ ఛేదించడం విశేషం.
తుది జట్లు ఇలా.. (అంచనా)
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ , సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, పియూష్ చావ్లా, కాంబోజ్, తుషార, బుమ్రా
KKR Vs MI Dream11 Prediction:
==> వికెట్ కీపర్: ఫిల్ సాల్ట్, ఇషాన్ కిషాన్
==> బ్యాట్స్‌మెన్: సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ
==> ఆల్ రౌండర్లు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్
==> బౌలర్లు: పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, వరున్ చక్రవర్తి, నమన్ ధీర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter