Nitish Rana Fine: గెలిచిన ఆనందంలో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్‌.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సహా అందరికీ కోత!

Nitish Rana has been fined Rs 24 lakhs for the offence. గెలిచిన ఆనందంలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌కు కారణమవ్వడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 15, 2023, 03:51 PM IST
Nitish Rana Fine: గెలిచిన ఆనందంలో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్‌.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సహా అందరికీ కోత!

Nitish Rana Fined Rs 24 Lakh for slow over rate in CSK vs KKR match in IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన కోల్‌కతా.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (48 నాటౌట్‌; 1 ఫోర్‌, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసింది. కోల్‌కతా కెప్టెన్‌ నితీశ్‌ రాణా (57 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

గెలిచిన ఆనందంలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కారణమవ్వడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. 16వ సీజన్‌లో రెండో సారి స్లో ఓవర్‌ రేట్‌‌కు కేకేఆర్‌ గురవ్వడంతో.. నిబంధనల ప్రకారం భారీ జరిమానా విధించారు. కెప్టెన్ నితీశ్ రాణాకు రూ. 24 లక్షల జరిమానా పడింది. అదే సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని మిగతా ఆటగాళ్లందరికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) పెనాల్టీగా ఐపీఎల్ అధికారులు విధించారు. 

నిర్ణీత సమయం కన్నా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఒక ఓవర్ తక్కువ వేసింది. కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణా అంపైర్లతో వాగ్వాదానికి దిగడం కూడా మ్యాచ్ ఆలస్యానికి ఓ కారణం. మ్యాచ్ అనంతరం నితీశ్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టాడు. ప్రతి జట్టూ నిర్ణీత 20 ఓవర్ల బౌలింగ్ కోటాను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. రెండు స్ట్రాటజిక్ టైమ్‌ ఔట్‌లు, డీఆర్ఎస్ తీసుకోవడానికి, అంపైర్ల రివ్యూ  సమయాన్ని 90 నిమిషాల నుంచి మినహాయిస్తారు. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకుంటే.. తొలిసారి కెప్టెన్‌కు రూ.12 లక్షల ఫైన్  విధిస్తారు. రెండో సారి రిపీట్ అయితే కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టులోని ఆటగాళ్లందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధిస్తారు. 

స్లో ఓవర్‌ రేట్‌‌ మూడోసారి రిపీట్ అయితే జట్టు కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు. మరోవైపు జట్టులోని మిగతా ఆటగాళ్లకు రూ.12 లక్షల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. ఈ సీజన్లో కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణా స్లో ఓవర్‌ రేట్‌‌కు గురికావడం ఇది రెండోసారి. మూడోసారి రిపీట్ అయితే రాణా ఓ మ్యాచ్ నిషేదంను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Also Read: MS Dhoni-Sunil Gavaskar: చివరి మ్యాచ్ ఆడేసిన ఎంఎస్ ధోనీ.. ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ దిగ్గజం!  

Also Read: Tata Nexon Facelift: మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్ లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News