CSK Player Moeen Ali Says Chennai Super Kings Captain MS Dhoni to play IPL 2024: ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ధోనీ నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, 41 ఏళ్ల వయసులో అలా ఆడటం అంత సులభం కాదని అలీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో ధోనీ కచ్చితంగా ఆడతాడని మొయిన్ అలీ ధీమా వ్యక్తం చేశాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. ఐపీఎల్ టోర్నీలో మాత్రమే ఆడుతున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉండి చెన్నై జట్టుకు పరుగులు చేస్తున్నాడు.
ఐపీఎల్ 2023 అనంతరం ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు స్పందించారు. ఇటీవల సీఎస్‌కే మాజీ ఆటగాడు కేదార్ జాదవ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. తాజాగా చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ స్పందించాడు. 'ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2024లో కచ్చితంగా ఆడగలడు. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తే.. ఇంకో 2-3 సంవత్సరాలు ఆడతాడు అని నాకు అనిపిస్తోంది. మహీ చాలా ఫిట్‌గా ఉన్నాడు' అని మొయిన్ అలీ అన్నాడు.
'ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌పై ఎంఎస్ ధోనీ ఆడిన తీరును చూసి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. ధోనీ నెట్స్‌లో ఆడుతున్నప్పుడు నిత్యం చూస్తూనే ఉంటా. నెట్స్‌లో నమ్మశక్యం కాని విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అలా ఆడుతుండటం చూడటానికి అద్భుతంగా ఉంది. అయితే ఈ వయసులో అలా ఆడటం అంత సులభం కాదు' అని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ధోనీ చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
కెట్ నెక్స్ట్‌తో ప్రత్యేక చాట్‌లో కేదార్ జాదవ్ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో ఆటగాడిగా ఎంఎస్ ధోనీకి ఇది చివరి సీజన్ అని నేను 2000 శాతం చెబుతున్నా. ఈ జూలైలో ధోనీకి 42 ఏళ్లు వస్తాయి. ఇంకా ఫిట్‌గా ఉన్నప్పటికీ మహీ మనిషే కాబట్టి రిటైర్మెంట్ ఇస్తాడు. అభిమానులు ధోనీ మ్యాచ్‌లను అస్సలు మిస్ అవ్వొద్దు. ఫీల్డ్‌లో ఉన్న ప్రతి బంతిని చూసి ఎంజాయ్ చేయండి' అని అన్నాడు.
Aslo Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వడగళ్ల వాన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.