Michael Vaughan feels Rajasthan Royals to win IPL 2023 Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 నేడు రాత్రి ఆరంభం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 16వ సీజన్ మొదటి మ్యాచ్ జరగనుంది. అరంగేట్రం చేసిన తొలి ఏడాదే ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకున్న గుజరాత్.. మరోసారి టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే కూడా టైటిల్ కొట్టాలని చూస్తోంది. ఇక ఈ సీజన్ తొలి మ్యాచ్ కావడంతో ఫాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా టోర్నీ ఆరంభం కాకముందే విజేతగా నిలిచే జట్టు ఏదో ముందే అంచనా వేశారు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్.
ఐపీఎల్ 2023 విజేతగా రాజస్థాన్ రాయల్స్ నిలుస్తుందని స్టార్ కామెంటేటర్ మైకెల్ వాన్ జోస్యం (IPL 2023 Winnner Prediction) చెప్పాడు. 'ఐపీఎల్ 2023 మ్యాచ్‌ల ప్రారంభం కోసం నేను కూడా ఆత్రుతగా ఉన్నా. క్రిక్‌బజ్‌తో జట్టు కట్టేందుకు ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్‌దే. ఐపీఎల్ 2023 ట్రోఫీని సొంతం చేసుకునేది రాజస్థాన్' అని మైకెల్ వాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైకెల్ వాన్ ట్వీట్ చూసి రాజస్థాన్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Can’t wait for the IPL to start .. Looking forward to being part of the @cricbuzz team .. I thinks it’s going to be @rajasthanroyals year .. they will be lifting the trophy in late May .. #OnOn #IPL2023
— Michael Vaughan (@MichaelVaughan) March 29, 2023
2008లో జరిగిన తొలి ఐపీఎల్ టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ జట్టు మరో టైటిల్ అందుకోలేకపోయింది. ఐపీఎల్ 2022 ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ ఈసారి గట్టిపోటీదారుగా ఉంటుందని, టైటిల్‌ను సాధించే అవకాశం ఎక్కువగా ఉందని మైకెల్ వాన్ పేర్కొన్నారు. తొలిసారి ఇంగ్లీష్ సీనియర్ ఆటగాడు జో రూట్ ఐపీఎల్లో ఆడబోతున్నాడు. మిడిలార్డర్లో కీలకమవుతాడని రాజస్థాన్ మేనేజ్మెంట్ కూడా భావిస్తోంది. ఇక ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది.
Also Read: MS Dhoni Injury: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.