CSK vs SRH IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎంఎస్ ధోనీకి సూపర్ ట్రాక్ రికార్డ్.. మరీ ఇంతలా బాదాడా!

Chennai Super Kings Captain MS Dhoni have track record against Sunrisers Hyderabad. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 21, 2023, 02:13 PM IST
CSK vs SRH IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎంఎస్ ధోనీకి సూపర్ ట్రాక్ రికార్డ్.. మరీ ఇంతలా బాదాడా!

Chennai Super Kings Captain MS Dhoni hits 488 Runs vs Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు ఈ సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లు అయిదేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. సీఎస్‌కే మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు విజయాలు అందుకుని పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దాంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. 

అయితే నేటి మ్యాచ్‌లో (CSK vs SRH IPL 2023 29th Match) చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్‌పై ఇప్పటివరకు ధోనీ 145.24 స్ట్రైక్ రేట్‌తో 488 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌పై మహీ బ్యాటింగ్ యావరేజ్ 48.80గా ఉంది. ధోనీ నేటి మ్యాచ్‌లో మరో 12 పరుగులు చేస్తే.. 500 పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. విరాట్ కోహ్లీ ఓ జట్టుపై 1000 పరుగులు చేసినా.. అతడు టాప్ ఆర్డర్ బ్యాటర్. 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసే ధోనీ పటిష్ట బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్‌పై 500 రన్స్ చేయడం అంటే విశేషం అనే చెప్పాలి. 

ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీకి తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 239 మ్యాచ్‌లను ఆడిన ధోనీ.. 39.35 యావరేజ్‌, స్ట్రైక్ రేట్ 135.77.24తో 5,037 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 82 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ధోనీ వ్యక్తిగత హై స్కోర్ 84 నాటౌట్. మహీ 24 హాఫ్ సెంచరీలు బాదాడు. ధోనీ కేప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 11 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. నాలుగుసార్లు చెన్నై జట్టు టైటిల్స్ (2008, 2009, 2018, 2021) గెలుచుకుంది.

ఇక మోకాలికి గాయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లను అతను ఆడలేదు. తాజాగా స్టోక్స్ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. దాంతో నేటి మ్యాచ్‌లో అతను ఆడటం దాదాపుగా ఖాయమైంది. స్టోక్స్ జట్టులోకి వస్తే డ్వైన్ ప్రిటోరియస్‌ను పక్కన పెట్టొచ్చు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు స్టోక్స్ రెండు మ్యాచ్‌లే ఆడి 18 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాడు. 

Also Read: Twitter Blue Tick: ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయిన ధోనీ, కోహ్లీ, రోహిత్.. అసలు కారణం ఇదే!  

Also Read: Samyuktha Menon Pics: దేవకన్యలా సంయుక్త మీనన్.. సార్ బ్యూటీ అందాలకు కుర్రకారు ఢమాల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News