IPL Auction 2023: ఈ ముగ్గురు ఆల్‌రౌండర్‌లపైనే ఐపీఎల్ ప్రాంచైజీల కన్ను.. కోట్ల వర్షం కురవడం పక్కా! భారత ప్లేయర్స్ లేరు

Ben Stokes to get 10 to 15 crores in IPL 2023 Auction. 2023 డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో ఐపీఎల్ 2023 వేలం జరగనుంది. ఈ వేలంలో 3 మంది వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌లకు భారీ డిమాండ్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 15, 2022, 01:13 PM IST
  • ఈ 3 ఆల్‌రౌండర్‌లపైనే ప్రాంచైజీల కన్ను
  • కోట్ల వర్షం కురవడం పక్కా
  • భారత ప్లేయర్స్ లేరు
IPL Auction 2023: ఈ ముగ్గురు ఆల్‌రౌండర్‌లపైనే ఐపీఎల్ ప్రాంచైజీల కన్ను.. కోట్ల వర్షం కురవడం పక్కా! భారత ప్లేయర్స్ లేరు

Ben Stokes, Shakib Al Hasan and Sam Curran to get 10 to 15 crores in IPL 2023 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2023 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. 2023 డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో వేలం జరగనుంది. 2023 మినీ వేలం కోసం 991 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. 405 మందిని ఐపీఎల్ యాజమాన్యం షార్ట్ లిస్ట్ చేసింది. 405 మంది ఆటగాళ్లలో 273 మంది భారత ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక నలుగురు ఆటగాళ్లు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం మొత్తం 87 స్లాట్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్లకు రిజర్వు చేశారు.

బెన్ స్టోక్స్:
ఐపీఎల్ 2023 వేలంలో 3 మంది వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌లు ఉన్నారు. అందులో మొదటి ప్లేయర్ ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్. ఆధునిక క్రికెట్  గొప్ప ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా ఉన్న స్టోక్స్.. ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2018 ఐపీఎల్ వేలంలో స్టోక్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. రూ. 12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు దాదాపుగా 15 కోట్లకు అమ్ముడుపోవచ్చు. మానసిక ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు స్టోక్స్ గత సంవత్సరం ఐపీఎల్ ఆడలేదు. 

షకీబ్ అల్ హసన్:
బంగ్లాదేశ్ అత్యుత్తమ క్రికెటర్లలో షకీబ్ అల్ హసన్ ఒకడు. తన క్రికెట్ కెరీర్‌లో అనేక ఐపీఎల్ జట్లకు వెన్నెముకగా నిలిచాడు. బ్యాటింగ్‌లో నిలకడ, ఖచ్చితత్వం మరియు బంతితో దూకుడు అతడి అస్రాలు. అంతర్జాతీయంగా మరియు దేశీయంగా అత్యుత్తమ  ప్రదర్శన ఇవ్వడానికి అవే అతడికి హెల్ప్ అయ్యాయి. గతంలోఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న షకీబ్ ను కొనేందుకు అన్ని జట్లు ప్రణాళికలు రచిస్తునాయి. షకీబ్ ఈజీగా 5-10 కోట్లు పలుకుతాడు. 

సామ్ కరన్:
ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022ను ఇంగ్లండ్‌ గెలవడంలో సామ్ కరన్ పాత్ర కీలకం. ఈ యువ లెఫ్టార్మ్ పేస్ ఆల్‌రౌండర్‌ తన తొలి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొని అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకోవడమే కాకుండా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్‌ల తరఫున అద్భుతంగా ఆడిన కరన్‌పై ఐపీఎల్ ప్రాంఛైజీలు కన్నేశాయి. దాదాపుగా 10 కోట్లు పలికే అవకాశం ఉంది. 

Also Read: Best Electric Bikes: రూ.100కే 400 కిలోమీటర్ల ప్రయాణం.. రూ.999కే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోండి!  

Also Read: Betel Leaves Vastu Tips: తమలపాకులతో ఈ చిన్న పనిచేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది! ఊహించని డబ్బు మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News