Travis Head: ట్రేవిస్ హెడ్ కోసం చెన్నై, హైదరాబాద్ మధ్య పోటీ, 6.80 కోట్లకు దక్కించుకున్న కావ్య పాప

Travis Head: ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ట్రేవిస్ హెడ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. రసవత్తరంగా సాగిన పోటీలో చివరికి ఎస్ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2023, 02:10 PM IST
Travis Head: ట్రేవిస్ హెడ్ కోసం చెన్నై, హైదరాబాద్ మధ్య పోటీ, 6.80 కోట్లకు దక్కించుకున్న కావ్య పాప

Travis Head: ఐపీఎల్ 2024 వేలం దుబాయ్ వేదికగా జరుగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆకర్షించిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ట్రేవిస్ హెడ్ కోసం ఊహించినంత కాకపోయినా పోటీ మాత్రం జరిగింది. చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంది. 

ఐపీఎల్ 2024 వేలంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ట్రేవిస్ హెడ్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడతాయనే అంచనా ఉండింది. అయితే తీరా వేలం ప్రారంభమయ్యాక పరిస్థితి అందుకు భిన్నంగా సాగింది. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ట్రేవిస్ హెడ్ వేలంలో కేవలం రెండే జట్లు పోటీ పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రమే ట్రేవిస్ హెడ్ కోసం పోటీ పడ్డాయి. 34 కోట్ల వ్యాలెట్‌తో వేలంలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు నుంచే ట్రేవిస్ హెడ్‌పై దృష్టి సారించినట్టు కన్పించింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతని కోసం పోటీ పడింది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ట్రేవిస్ హెడ్ కోసం మిగిలిన ఫ్రాంచైజీలు పోటీపడకపోవడం గమనార్హం. అదే సమయంలో ట్రేవిస్ హెడ్ 10-12 కోట్ల వరకూ ధర పలకవచ్చనే అంచనాలుండేవి. కానీ అందుకు భిన్నంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య పోటీలో 6.80 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. 

గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి ఆశించిన ఆటతీరు లేకపోవడంతో వదులుకున్న హ్యారీ బ్రూక్ ను ఈసారి ఢిల్లీ కేపిటల్స్ జట్టు 4 కోట్లకు దక్కించుకుంది. అంటే గతంతో పోలిస్తే హ్యారీ బ్రూక్‌కు 9 కోట్లు నష్టమే. ట్రేవిస్ హెడ్‌ను 6.80 కోట్లకే దక్కించుకోవడంతో కావ్య పాప ఆనందం స్పష్టంగా కన్పించింది. 

Also read: IPL 2024 Telugu Cricketers: ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు, అదృష్టం ఎందరికి వరిస్తుందో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News