BCCI IPL Rights: ఐపీఎల్ 2023 నుంచి 2027 వరకూ అంటే ఐదు ఐపీఎల్ సీజన్ల సన్నాహాలు ఇప్పట్నించే ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క ఐపీఎల్ మ్యాచ్ ఖరీదు 118 కోట్లు కాగా..ఒక్కొక్క ఓవర్ ఖరీదు 3 కోట్లుగా ఉంది. ఆశ్యర్యంగా ఉందా..
ఐపీఎల్ 2023-2027 అంటే వచ్చే ఏడాది నుంచి వరుసగా ఐదు ఐపీఎల్ సీజన్లకు సంబంధించి సన్నాహాలు బీసీసీఐ ప్రారంభించేసింది. మీడియా హక్కుల వేలం పూర్తయింది. ఈ ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 410 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. కాగా ఒక్కొక్క ఐపీఎల్ మ్యాచ్ 118 కోట్లు విలువ చేస్తోందని లెక్కగడుతున్నారు. ఒక్కొక్క ఓవర్ ధర 2.97 కోట్లుగా ఉంది. ఈ లెక్కలేంటో అర్ధం కావడం లేదా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల్ని 2023-2027 ఐదేళ్ల కోసం బీసీసీఐ 48 వేల 390 కోట్లకు అమ్మేసింది. డిస్నీ హాట్ స్టార్ ప్యాకేజ్ ఏలో భాగంగా 23 వేల 575 కోట్లకు శాటీలైట్ టీవీ హక్కులు సొంతం చేసుకుంది. అంటే ఒక్కొక్క మ్యాచ్కు 57.5 కోట్లు. ఇక వయాకామ్ 18 ప్యాకేజ్ బి మరియు సి లో భాగంగా మరో 23 వేల 758 కోట్లకు డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. వయాకామ్ 18 ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, యూకే ప్రాంతాల్లో కూడా ప్యాకేజ్ డి హక్కుల్ని సొంతం చేసుకుంది.
ఇక 2008 నుంచి 2017 వరకూ పది సీజన్లకు సోనీ సంస్థ గతంలో 8 వేల 2 వందల కోట్లకు మీడియా హక్కులు పొందింది. ఆ తరువాత అంటే 2018-2022 ఐదేళ్లకు స్టార్ సంస్థ రెట్టింపు ధరకు కైవసం చేసుకుంది. ఇప్పుడు రానున్న ఐదు సీజన్లకు వేలం వేసినప్పుడు ఏకంగా 48 వేల 390 కోట్లు పలికింది. ఇది ప్రపంచంలో బీసీసీఐను అత్యధికంగా డబ్బులు కలిగిన సంస్థగా తీర్దిదిద్దింది.
రానున్న ఐదేళ్లలో మొత్తం 410 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. అంటే బీసీసీఐ మీడియా, డిజిటల్ హక్కుల వేలంలో దక్కించుకున్న మొత్తంతో లెక్కలేస్తే..ఒక్కొక్క మ్యాచ్ ఖరీదు 118 కోట్లు కానుంది. ప్రతి ఒక్క ఓవర్ ధర 2.95 కోట్లు ఉంటుంది. ప్రతి ఒక్క బాల్ ఖరీదు 49 లక్షలౌతుంది. గత సీజన్ అంటే 2018-22లో అయితే ప్రతి మ్యాచ్ ఖరీదు 55 కోట్లుగా ఉంది. అదిప్పుడు రెట్టింపు కంటే ఎక్కువైంది. మూడు రోజులపాటు తొలిసారిగా జరిగిన మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్ శాటిలైట్ టీవీ హక్కుల్ని, వయాకామ్ 18 డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్నాయి. శాటిలైట్, డిజిటల్ టీవి హక్కుల్ని రెండుగా విభజించడమే కాకుండా నాలుగు ప్యాకేజ్లుగా బిడ్డింగ్ ప్రారంభించడం ఇదే తొలిసారి.
Also read: India vs South Africa: టీ20 మూడవ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook