IPL 2022: ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ ను వీడుతున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు.. తలలు పట్టుకుంటున్న ఫ్రాంఛైజీలు

ఈ నెల (మార్చి 26) న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ మెగాటోర్నీ టీమ్ లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు.. ఒకరి తరువాత ఒకరు టోర్నీ నుండి వీడుతున్నారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఆటగాళ్లు టోర్నీకి దూరం అవ్వటంతో ఫ్రాంఛైజీలు తలలు పట్టుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 04:21 PM IST
  • ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ ను వీడుతున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు
  • కీలక ఆటగాళ్లను కోల్పోయిన ఐపీఎల్‌ టీంలు
  • ఐపీఎల్‌ కు దూరమైన ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌
IPL 2022: ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ ను వీడుతున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు.. తలలు పట్టుకుంటున్న ఫ్రాంఛైజీలు

IPL 2022: మార్చి 26 నుండి మెగా టోర్నీ ఐపీఎల్‌ 2022 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్‌ వేలం పూర్తి అవ్వగా.. మెగా టోర్నీ ఆరంభానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపీఎల్‌ 2022 గురించి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐకి ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు.. కొంత మంది గాయాల కారణంగా మెగా టోర్నీకి దూరం అవుతుండగా.. మరి కొంత మంది బయోబబుల్‌ పద్దతి నచ్చక ఈ టోర్నీకి దూరం అవుతున్నారు.

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ 2022 సీజన్‌ కు దూరమవుతున్నారు. బయోబబుల్‌ లో ఉండటం ఇష్టంలేక ఇప్పటికే ఆలెక్స్‌ హెయిల్స్‌, జేసన్‌ రాయ్‌ టోర్నీ నుంచి వైదొలిగారు. తాజాగా గాయం కారణంగా ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ కూడా ఐపీఎల్‌ కు దూరమయ్యాడు. అతన్ని లక్నో సూపర్‌ జెయింట్స్‌ వేలంలో ఏడున్నర కోట్లకు దక్కించుకున్నది. నెట్‌ ప్రాక్టీస్‌ లో కుడి చేతికి గాయం అయినట్టు తేలింది. దీంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అటు ముంబై ఇండియన్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా ఐపీఎల్‌ కు దూరమయ్యాడు. గాయం కారణంగా ఇప్పటికే 2021 ఐపీఎల్‌ సెకండ్‌  హాఫ్‌ ఆడని.. ఆర్చర్‌.. ఇప్పటికీ కోలుకోలేదు. దీంతో అతను కూడా ఈ సీజన్‌ లో పాల్గొనడం లేదని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ప్రకటించింది.

ఐపీఎల్‌ 2022 సీజన్‌ కు సంబంధించి ఇంగ్లాండ్‌ నుంచి చాలా మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నప్పటికీ.. కొందరినీ మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇక ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడు కూడా ఇంగ్లాండ్‌ నుంచే ఉన్నాడు. లివింగ్‌ స్టోన్‌ ను పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పదకొండున్నర కోట్లకు కొనుగోలు చేసింది. జానీ బెయిర్‌స్ట్రో ను కూడా పంజాబ్‌ 6 కోట్ల 75లక్షలకు వేలంలో దక్కించుకున్నది. క్రిస్‌ జోర్డాన్‌ ను మూడున్నరకోట్లకు సీఎస్‌కే తీసుకుంది. సీమర్‌ మిల్స్‌ ను కోటిన్నరకు ముంబై దక్కించుకున్నది. సామ్‌ బిల్లింగ్స్‌ ను కేకేఆర్‌ 2 కోట్లకు కొనుగోలు చేసింది. డేవిడ్‌ విల్లీని ఆర్సీబీ జట్టు 2 కోట్లకు వేలంలో దక్కించుకున్నది. మార్క్‌ వుడ్‌ ను లక్నో జట్టు ఏడున్నరకోట్లకు, జోఫ్రా ఆర్చర్‌ ను.. ముంబై 8 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. అటు బెన్నీ హోవల్‌ అనే ఆటగాడిని కూడా పంజాబ్‌ 40 లక్షలకు దక్కించుకున్నది. 

Also Read: Paruchuri Venkateswara rao: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు.. షాక్ అవుతున్న నెటిజన్లు..

Also Read: Capital Punishment: సౌదీలో సంచలనం.. ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News