IPL-2022 CSK vs KKR: ఐపీఎల్-15 సీజన్ తొలి మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ అర్ధ శతకం సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన చెన్నై వెంట వెంటనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి కేవలం 61 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో చెన్నై 120 పరుగుల స్కోర్ అయినా చేస్తుందా లేదా అన్న సందేహం కలిగింది. కానీ ఆ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ 38 బంతుల్లో 50 పరుగులు చేయడంతో చెన్నై 131 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది.
ధోనీ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చెన్నై జట్టులో ధోనీ తర్వాత ఊతప్ప (28), జడేజా (26) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్స్ చేశారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అవగా, మరో ఓపెనర్ కాన్వే మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడు 15 పరుగులు, శివమ్ దూబే 3 పరుగులు చేశారు. కేకేఆర్ జట్టులో ఉమేష్ యాదవ్ 2 వికెట్లు, చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.
ఇక 131 పరుగుల లక్ష్య సాధనతో బరిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. 5.2 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 40/0. ప్రస్తుతం అజింక్యా రహానే (27), వెంకటేశ్ అయ్యర్ (15) క్రీజులో ఉన్నారు. కోల్‌కతా బ్యాటింగ్ చూస్తుంటే... 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై కాపాడుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
Also Read: CSK vs KKR: ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్.. ముగ్గురు ఆటగాళ్లను ఊరిస్తున్న టాప్ రికార్డులు ఇవే!!
Also Read: TS Traffic Challans: పొడిగింపు లేదు.. ట్రాఫిక్ చలాన్ రాయితీ ఈ నెలాఖరు వరకే! వెంటనే త్వరపడండి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook