IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!

Moeen Ali likely to miss CSK First match vs KKR in IPL 2022.  డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ తగలనుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ మొయిన్ అలీ ఆరంభ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 01:56 PM IST
  • సీఎస్‌కేకు మరో షాక్‌
  • స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం
  • తొలి మ్యాచ్‌కు రుతురాజ్‌ గైక్వాడ్ దూరం
IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!

IPL 2022, Moeen Ali likely to miss CSK First match vs KKR: ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 మ‌రో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ స‌మయంలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ తగలనుంది. ఇప్ప‌టికే టీమిండియా స్టార్ పేసర్ దీప‌క్ చహ‌ర్ ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కాగా.. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ మొయిన్ అలీ ఆరంభ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. వీసా సమస్యతో అలీ సకాలంలో భారత్‌కు వచ్చే అవకాశాలు లేవు. 

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీకి గత 20 రోజులుగా భారత్ రావ‌డానికి వీసా దొరకడం లేదు. దీంతో అలీ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. అలీ వీసాపై తాజా చెన్నై సూప‌ర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. 'భారత్ వచ్చేందుకు  ఫిబ్రవరి 28నే మొయిన్‌ అలీ వీసా అప్లై చేశాడు. 20 రోజులైనప్పటికి అతనికి వీసా దొరకడం లేదు. నిజానికి అలీ భారత్‌కు రెగ్యులర్‌గా వస్తుండేవాడు. ఎప్పుడు రాని వీసా సమస్య ఈసారి మాత్రమే వచ్చింది. అదేంటనేది అర్థం కావడం లేదు' అని విశ్వనాథ్ తెలిపారు. 

'మేం కూడా ఇంగ్లండ్‌లోని భారతీయ ఎంబసీతో మాట్లాడుతున్నాం. మొయిన్‌ అలీ వీసా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరాం. త్వరలోనే అలీ జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం. బీసీసీఐ కూడా అతడి వీసా విషయమై అక్కడి ఎంబసీతో చర్చలు చేస్తుంది. సోమవారం అతనికి వీసా పేపర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడికి వచ్చాక మూడు రోజులు క్వారంటైన్‌ కారణంగా కేకేఆర్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు' అని చెన్నై సూప‌ర్ కింగ్స్ సీఈఓ చెప్పారు. 

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీని ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రూ. 8 కోట్లతో సీఎస్‌కే రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది అలీ బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన అలీ.. పవర్ ప్లేలో చెన్నైకి కీలక పరుగులు చేశాడు. సీఎస్‌కే టైటిల్ గెలవడంతో అతడి పాత్ర ఎంతో ఉంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌కు రుతురాజ్‌ గైక్వాడ్ దూరం కాగా..  దీపక్‌ చహర్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. తాజాగా మొయిన్‌ అలీ కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. 

Also Read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!

Also Read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News