Jos Buttler hundred, Yuzvendra Chahal 2 wickets helps Rajasthan beat Mumbai: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయాన్ని అందుకుంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో గెలిచింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 170/8 స్కోరుకే పరిమితమైంది. కీరన్ పొలార్డ్ (22) ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నా.. జట్టును ఆదుకోలేకపోయాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (61 : 33 బంతుల్లో 3×4, 5×6), ఓపెనర్ ఇషాన్ కిషన్ (54 : 43 బంతుల్లో 5×4, 1×6) అర్ధ శతకాలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లు నవదీప్ సైని, యుజ్వేంద్ర చహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఒక సిక్స్ బాది మంచి ఊపులో ఉన్న శర్మను ప్రసిద్ కృష్ణ ఔట్ చేశాడు. మరికొద్దిసేపటికే అన్మోల్‌ప్రీత్ సింగ్ (5)ను నవదీప్ సైని వెనక్కిపంపాడు. దాంతో 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబైని ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఆదుకున్నారు. ఇషాన్ ఆచితూచి ఆడినా... తిలక్ బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో ముంబై లక్ష్యం దిశగా సాగింది.
ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మూడో వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ ఔట్ అయిన కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన వర్మ కూడా పెవిలియన్ చేరాడు. వర్మను ఔట్ చేసిన ఆర్ అశ్విన్.. మ్యాచును మలుపుతిప్పాడు. ఆ వెంటనే చహల్ రెండు వికెట్లు పడగొట్టి ముంబైని మరింత దెబ్బకొట్టాడు. కీరన్ పొలార్డ్ ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నా.. జట్టును గెలిపించలేకపోయాడు. యాష్ మ్యాచును మలుపుతిప్పాడు. సైని, చహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
2 wins in a row for @rajasthanroyals as they beat Mumbai Indians by 23 runs 👏👏
Scorecard ➡️ https://t.co/VsJIgyi126 #MIvRR #TATAIPL pic.twitter.com/LyxNwkv7ty
— IndianPremierLeague (@IPL) April 2, 2022
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 రన్స్ చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (100 : 68 బంతుల్లో 11×4, 5×6) సెంచరీ చేశాడు. షిమ్రోన్ హెట్‌మయర్ (35 : 14 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా ఆడగా.. సంజూ శాంసన్ (30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Also Read: Keerthi Suresh: కృతిశెట్టి నో చెప్పిన పాత్రకు కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.