CSK vs GT: వృద్ధిమాన్ సాహా సూపర్ షో.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం! 20 పాయింట్స్

CSK vs GT: Gujarat Titans trash Chennai Super Kings. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 08:05 PM IST
  • వృద్ధిమాన్ సాహా సూపర్ షో
  • చెన్నైపై గుజరాత్ ఘన విజయం
  • గుజరాత్ ఖాతాలో 20 పాయింట్స్
CSK vs GT: వృద్ధిమాన్ సాహా సూపర్ షో.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం! 20 పాయింట్స్

Wriddhiman Saha 67 runs helps Gujarat Titans trash Chennai Super Kings: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై నిర్ధేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 137 రన్స్ చేసింది. వెటరన్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా (67 నాటౌట్; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చెన్నై బౌలర్లలో మతీష పతిరాన రెండు వికెట్లు పడగొట్టాడు. 

చెన్నై నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్‌ గిల్ (18) మంచి ఆరంభమే ఇచ్చారు. ముకేశ్‌ చౌదరి వేసిన తొలి ఓవర్‌లోనే సాహా మూడు ఓవర్లు కొట్టాడు. రెండో ఓవర్లో కూడా ఫోర్ బాది పరుగుల వరద పారించారు. ఆపై కూడా ఈ ఇద్దరు ధాటిగానే ఆడారు. దాంతో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా గుజరాత్‌ 53 పరుగులు చేసింది. మతీశా పతిరాణా వేసిన ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. 

ఆ తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్ (20) ధాటిగా ఆడాడు. అయితే వేడ్, హార్దిక్ పాండ్యా (7) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్ (15 నాటౌట్)తో కలిసి ఆచితూచి ఆడిన వృద్ధిమాన్ సాహా.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. చెన్నై బౌలర్లలో మతీష ప్రతిరాణా రెండు వికెట్లు తీయగా.. మొయీన్ అలీ ఒక వికెట్ తీసుకున్నాడు. గుజరాత్‌ 13 మ్యాచుల్లో 10 విజయాలు అందుకుని 20 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గుజరాత్‌ టేబుల్ టాపర్ గా ఉంది.  

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే (5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరగా.. మొయీన్ అలీ (21) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (53) మరోసారి జట్టును ఆదుకున్నాడు. నారాయణ్ జగదీశన్ (39 నాటౌట్)తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) రాణించలేదు. గుజరాత్ బౌలర్ మొహ్మద్ షమీ రెండు వికెట్లతో సత్తాచాటాడు. 

Also Read: Heart Attack: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి!

Also Read: Thomas Cup 2022: బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 73 ఏళ్ల త‌ర్వాత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News