Virat Kohli 6000 Runs In IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో జోరు మీదుంది. సీజన్లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ సేన దుమ్మురేపుతోంది. ఐపీఎల్ 2021 టైటిల్ రేసులో తాము ఉన్నామని ఇతర జట్లకు ప్రమాదకర సంకేతాలు పంపింది ఆర్సీబీ. రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం ద్వారా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 72 పరుగులతో విరాట్ కోహ్లీ నౌటౌట్‌గా నిలిచాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఐపీఎల్ 2021 సీజన్(IPL 2021)లో తొలి హాఫ్ సెంచరీ బాదడం ద్వారా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు 6 వేల పరుగుల ఫీట్‌కు 51 పరుగుల దూరంలో ఉన్నాడు. రాజస్తాన్ బౌలింగ్‌లో వేగంగా పరుగులు సాధించి ఐపీఎల్లో ఆరు వేల పరుగుల మార్క్ చేరిన తొలి క్రికెటర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 196 మ్యాచ్‌లలో 38.4 సగటుతో 6021 పరుగులు చేశాడు.
Also Read: RCB vs RR, IPL 2021: రెచ్చిపోయిన Devdutt Padikkal, Virat Kohli.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం
విరాట్ కోహ్లీ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు సురేష్ రైనా ఉన్నాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ మైలురాయిని చేరుకోగానే సురేష్ రైనా అభినందించాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ చరిత్రలో 5 వేలు పైగా పరుగులు సాదించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. హ్యాట్రిక్ విజయాలు సాధించి జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం ఇందుకు ఆదివారం నాడు వేదికగా మారనుంది.
Also Read: IPL 2021: సీఎస్కే కెప్టెన్ MS Dhoni ఖాతాలో అరుదైన రికార్డు, లీగ్ చరిత్రలో తొలిసారిగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook