ఐపీఎల్ 2018: 'రాయల్'గా గెలిచారు

ఐపీఎల్‌లో భాగంగా ముంబై న‌గ‌ర ప‌రిధిలోగల వాంఖడే స్టేడియం వేదిక‌గా ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Last Updated : May 14, 2018, 09:27 AM IST
ఐపీఎల్ 2018: 'రాయల్'గా గెలిచారు

ఐపీఎల్‌లో భాగంగా ముంబై న‌గ‌ర ప‌రిధిలోగల వాంఖడే స్టేడియం వేదిక‌గా ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాగా, మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది. ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 168 ప‌రుగులు చేసింది.

అనంతరం రాజస్థాన్ 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా.. బట్లర్ చెలరేగి ఆడాడు. అతడికి కెప్టెన్ రహనే (38), శాంసన్ (26) సహకారం అందించారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో (రెండు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే) మూడు వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో ముంబైపై రాజ‌స్థాన్ విజ‌యం సాధించి టోర్నీలో ప్లే ఆఫ్ బెర్త్ రేసులో నిలిచింది. కాగా, ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బ‌ట్లర్ (56 బంతుల్లో 94 నాటౌట్ )నిలిచాడు.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్‌లో ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన భారత దేశీయ జట్టు ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్ లో సూర్య కుమార్ చేసిన పరుగులు 473.

ఐపీఎల్-11 పాయింట్ల పట్టిక

  • సన్‌రైజర్స్ హైదరాబాద్-12మ్యాచులు-9విజయాలు -18 పాయింట్లు
  • చెన్నై సూపర్ కింగ్స్- 12మ్యాచులు -8విజయాలు -16పాయింట్లు
  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 11మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
  • కోల్‌కతా నైట్ రైడర్స్- 12మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
  • రాజస్థాన్ రాయల్స్-12మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
  • ముంబై ఇండియన్స్- 12మ్యాచులు-5విజయాలు-10పాయింట్లు
  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 11మ్యాచులు -4విజయాలు-8పాయింట్లు
  • ఢిల్లీ డేర్‌డెవిల్స్- 12మ్యాచులు-3విజయాలు-6పాయింట్లు

Trending News