Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్

Cricket in Olympics: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రికెట్..ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్‌లో ఎందుకు లేదో చాలామందికి తెలియదు. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులకు ఆ కోరిక కూడా నెరవేరనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2023, 05:53 PM IST
Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్

Cricket in Olympics: అంటే క్రికెట్ ప్రేమికులకు మరో ప్రపంచకప్ లాంటిది వచ్చి చేరనుంది. ఇప్పటికే టీ 20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ రెండున్నాయి. ఇకపై మూడవది టీ20 ఒలింపిక్స్ వచ్చి చేరనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరిక ఎప్పట్నించి, ఎలా ఉంటుందనే వివరాలు మీ కోసం..

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కలిగిన ఆటగా క్రికెట్ కు పేరుంది. క్రికెట్‌ను తిరిగి ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని ముంబైలో ఇావాళ జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు వందేళ్ల సుదీర్ఘ విరామం తరువాత క్రికెట్ తిరిగి ఒలింపిక్స్‌లో కన్పించనుంది. గతంలో అంటే 1900 సంవత్సరంలో చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. కేవలం రెండే జట్లు అప్పట్లో ఆడాయి. ఆతిధ్య దేశం పారిస్‌తో పాటు గ్రేట్ బ్రిటన్ మధ్య రెండ్రోజుల టెస్ట్ జరిగింది. ఇరు జట్లలో 11 మంది కాకుండా 12 మంది ఆడారు. క్రికెట్ ఒలింపిక్ పతకం బ్రిటన్ కైవసం చేసుకుంది. 

ఇప్పుడు ఏకంగా 128 ఏళ్ల తరువాత అంటే 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. ఈసారి క్రికెట్‌తో పాటు స్క్వాష్ ఆటకు కూడా స్థానం లభించింది. ఇవాళ ముంబైలో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌లో ఓటింగ్ అనంతరం ఈ రెండు ఆటలకు అధికారికంగా ఆమోదముద్ర లభించింది. 

ఒలింపిక్స్ క్రికెట్ టీ20 ఫార్మట్‌లో జరగనుంది. మొత్తం ఆరు జట్లకే అవకాశముంటుంది. ఆతిద్య దేశమైనందున అమెరికాకు నేరుగా ప్రవేశముంటుంది. ఇక మిగిలిన ఐదు జట్లను ర్యాంకింగ్స్, అర్హత ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే మరో ఐదేళ్ల తరువాత జరిగే ఒలింపిక్స్ క్రికెట్ పోటీలో ఏ జట్లు అర్హత సాధిస్తాయో వేచి చూడాలి.

Also read: ICC Player of the Month: శుభ్‌మన్ గిల్‌ కు శుభవార్త.. ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. ఈ ఏడాదిలో రెండోసారి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News