Ind vs WI: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Ind Vs WI ODI Series: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. వన్డే సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను, టీ20 సిరీస్‌ కోసం 18 మంది ప్లేయర్స్‌ను ఎంపిక చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 12:45 AM IST
  • వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ఎంపిక
  • 18 మందితో టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ
  • తొలిసారి రవి బిష్ణోయ్‌కి పిలుపు
Ind vs WI: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Ind Vs WI ODI Series: స్వదేశంలో వెస్టిండీస్‌తో (West Indies) జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఆల్ రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో అతను ఆడబోవట్లేదని స్పష్టం చేసింది. జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చినట్లు వెల్లడించింది.  

విండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతరాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ 

విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ 

విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు మొత్తం 18 మందితో బీసీసీఐ (BCCI) భారత జట్టును (Team India) ప్రకటించింది. రవి బిష్ణోయ్‌కి తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది.  విండీస్‌తో సిరీస్‌కు ఆల్ రౌండర్ రిషి ధావన్‌‌ను ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ.. అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్దిక్ పాండ్యాను సిరీస్‌కు ఎంపిక చేయలేదు. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 9న రెండో వన్డే, 11న మూడో వన్డే అదే స్టేడియంలో జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 16,18,20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనున్నాయి.

Also Read: Omicron Survival: ఒమిక్రాన్ మనుగడ.. మనిషి చర్మంపై 21 గంటలు, ప్లాస్టిక్‌పై 8 రోజులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News