India vs England warm-up match: వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా ఘన విజయం.. మెరిసిన Ishan Kishan, KL Rahul

T20 World Cup India vs England Warm-Up Match: ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, కేఎల్‌ రాహుల్‌ 24 బంతుల్లో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభాన్ని అందించారు (Ishan Kishan, KL Rahul).

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 07:43 AM IST
India vs England warm-up match: వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా ఘన విజయం.. మెరిసిన Ishan Kishan, KL Rahul

T20 World Cup India vs England Warm-Up Match: దుబాయ్‌: టీ20 ప్రపంచ కప్ 2021 తొలి వామప్‌ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విధించిన 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 

ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, కేఎల్‌ రాహుల్‌ 24 బంతుల్లో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభాన్ని అందించారు (Ishan Kishan, KL Rahul). మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టేన్ విరాట్ కోహ్లీ (11) పరుగులకే లివింగ్‌ స్టోన్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అదే సమయంలో ఇషాన్‌ కిషన్‌ సైతం పెవిలియన్ బాటపట్టాడు. 

Also read : T20 World Cup 2021: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి రిషబ్‌ పంత్‌ 14 బంతుల్లో 29 పరుగులతో రాణిస్తున్న క్రమంలోనే సూర్యకుమార్‌ (8) విల్లే బౌలింగ్‌లో జోస్‌ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం కాగా.. ఒక్క 19వ ఓవర్లలోనే టీమిండియా 20 పరుగులు రాబట్టింది. ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య 10 బంతుల్లో 12 పరుగులు రాబట్టగా.. రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌లో జానీ బెయిర్‌ స్టో 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మొయీన్‌ అలీ సైతం 43 చేయగా లియామ్‌ లివింగ్‌ స్టోన్ 30 పరుగులు జోడించాడు. జేసన్‌ రాయ్‌ (17), జోస్ బట్లర్‌ (18), డేవిడ్‌ మలన్ 18 పరుగులు చేసి స్కోర్ ఇంకొంత పెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్‌ షమి (Mohammed Shami) మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), రాహుల్‌ చాహర్ చెరో వికెట్‌ పడగొట్టారు.

Also read : Watch: ధావన్‌ బ్యాటింగ్ స్టైల్‌పై కోహ్లీ వీడియో..ఫిదా అవుతున్న నెటిజన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News