Ind vs Eng 1st Test: తొలిదెబ్బ కొట్టిన లోకల్ బాయ్ R Ashwin, వెంట వెంటనే 2 వికెట్లు

India vs England 1st Test Live Score Updates: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ చెన్నై వేదికగా శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 5, 2021, 12:17 PM IST
  • ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, టీమిండియా ఆసక్తి
  • నేడు చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది
  • తొలి వికెట్‌కు అర్థ శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు
Ind vs Eng 1st Test: తొలిదెబ్బ కొట్టిన లోకల్ బాయ్ R Ashwin, వెంట వెంటనే 2 వికెట్లు

India vs England 1st Test Live Score Updates: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో నేడు చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. న్యూజిలాండ్ ఇదివరకే ఫైనల్ చేరిందని తెలిసిందే.

 

తొలుత పేసర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వికెట్లు పడగొట్ట లేకపోయారు. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌ను పెవిలియన్ బాట పట్టించాడు అశ్విన్. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ Ravichandran Ashwin బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకోవడంతో బర్న్స్(33; 60 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

Also Read: Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

 

అంతలోనే పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌ను భారత(Team India) పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బతీశాడు. అదే స్కోరు వద్ద ఇంగ్లాండ్ 2 వికెట్లను కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డాన్ లారెన్స్(0)ను ఖాతా తెరవకముందే ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఓపెనర్ డామ్ సిబ్లీ(26; 96 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 27 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 67/2 గా ఉంది. India Vs England 1st Test Live Score కోసం క్లిక్ చేయండి

Also Read: Abu Dhabi T10: Chris Gayle‌ విధ్వంసం, టీ10లో మెరుపు ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి జట్టు ఫిదా 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News