IND vs AFG: 14 నెలల తర్వాత టీ20ల్లోకి కోహ్లీ రీఎంట్రీ... భారత్‌, అఫ్గాన్‌ రెండో టీ20 నేడే..

IND vs AFG: ఈ సంవత్సరం జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో.. భారత జట్టు ఇప్పటి నుంచే సన్నాహాలు మెుదలుపెట్టింది. ఇవాళ్టి నుంచి భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 10:22 AM IST
IND vs AFG: 14 నెలల తర్వాత టీ20ల్లోకి కోహ్లీ రీఎంట్రీ... భారత్‌, అఫ్గాన్‌ రెండో టీ20 నేడే..

IND vs AFG, 02nd T20I Preview: నేటి నుంచి భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. 14 నెలల తర్వాత కింగ్ కోహ్లీ టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు. దీంతో అతడిపైనే అందరి చూపు ఉంది. ఇక తొలి మ్యాచ్ లో రనౌటైనా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మొహాలీలో కనబరిచిన జోరునే ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్ కు ప్రతీకారం తీసుకోవాలని అప్గాన్ జట్టు తీవ్రంగా ప్రాక్టీసు చేస్తుంది. స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ లేకపోయినా కాబూలీలు స్పిన్‌తో టీమిండియాను తిప్పలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గాయం కారణంగా తొలి టీ20కు దూరమైన యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జూన్ లో జరగబోయే ప్రపంచకప్ కు ముందు టీమిండియా మరో రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండటంతో.. జట్టు కూర్పు సరిచూసుకునేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడనుంది. కోహ్లీ జట్టులోకి రావడం వల్ల హైదరాబాదీ ప్లేయర్ తిలక్‌ వర్మకు చోటు లభించడం కష్టమే. మిడిలార్డర్‌లో యువ ఆటగాళ్లు శివమ్‌ దూబే, రింకూసింగ్‌, జితేశ్‌ శర్మ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈసారి కూడా భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్లుగా అర్ష్‌దీప్‌, ముఖేశ్‌లతోపాటు స్పిన్నర్లుగా అక్షర్‌, సుందర్‌, బిష్ణోయ్‌ టీమ్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మ్యాచ్ రాత్రి 07 గంటలకు ప్రారంభం కానుంది. 

తుది జట్లు (అంచనా)
భారత జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌/జైస్వాల్‌, కోహ్లీ, దూబే, రింకూ, జితేశ్‌, అక్షర్‌, సుందర్‌, కుల్దీప్‌/రవి, అర్ష్‌దీప్‌, ముఖేశ్‌.
అఫ్గానిస్థాన్‌ టీమ్: ఇబ్రహీం (కెప్టెన్‌), రహ్మానుల్లా, హష్మతుల్లా, అజ్మతుల్లా, నబీ, నజీబుల్లా, కరీమ్‌, నైబ్‌, ముజీబ్‌, నవీన్‌, ఫజల్‌

Also Read: Sourav Ganguly Biopic: త్వరలో తెరపైకి దాదా బయోపిక్‌.. హీరో ఎవరంటే?

Also Read: Tim Southee: పొట్టి క్రికెట్ లో టిమ్ సౌథీ ప్రపంచ రికార్డు.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News