ఏడోసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్

ఏడోసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్

Last Updated : Sep 29, 2018, 08:34 AM IST
ఏడోసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్

ఆసియా కప్‌‌ను భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ ఉత్కంఠ పోరులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాపై విజ‌యం సాధించింది. దీంతో కప్ భార‌త్ కైవ‌సం అయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ లిటన్ దాస్ (121), మెహిదీ హసన్ (32), సౌమ్య సర్కారు (33) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, కేదార్ జాదవ్ 2 వికెట్లు తీసుకోగా, బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో‌.. బంగ్లాను 48.3 ఓవర్లలో 222 పరుగులకే కట్టడి చేసింది.

అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే ధావన్ (15), రాయుడు (2) వికెట్లను కోల్పోయింది. అయితే రోహిత్ శర్మ (48; 55 బంతుల్లో 3×4, 3×6), దినేశ్ కార్తీక్ (37; 61 బంతుల్లో 1×4, 1×6), ధోనీ (36; 67 బంతుల్లో 3×4), జడేజా (23), కేదార్‌ జాదవ్‌ (23 నాటౌట్), భువనేశ్వర్‌ (21) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్‌ 2, రెబెల్ హొస్సైన్ 2 వికెట్లు తీసుకోగా, నజ్ముల్ ఇస్లాం, మోర్తాజా, మహ్మదుల్లా చెరో వికెట్ తీసుకున్నారు.

కాగా.. లిటన్‌ దాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, శిఖర్‌ ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.

కాగా ఈ విజయంతో.. భారత్‌ ఏడోసారి ఆసియా కప్‌ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.

Trending News