Shoaib Akhtar Says India knocked out from Semi Finals in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా గురువారం జరిగిన సూపర్ 12 పోరులో పాకిస్తాన్‌కు జింబాబ్వే భారీ షాకిచ్చింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో మాజీ ఛాంపియన్ పాక్‌ను ఓడించి సంచలన విజయాన్ని అందుకుంది. అంతమందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓడిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్లే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాబర్ ఆజామ్ బ్యాడ్ కెప్టెన్ అంటూ పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు.
'పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆటను అర్థం చేసుకోవడం ఎందుకు కష్టంగా ఉందో తెలియడం లేదు. టాప్, మిడిల్ ఆర్డర్‌తో పాకిస్తాన్ పెద్ద పెద్ద విజయాలు సాధించగలమని గతంలో చెప్పను.. మళ్లీ చెబుతున్నా. అయితే నిలకడగా మ్యాచులు గెలవలేకపోతున్నాము. పాకిస్తాన్ జట్టుకు బ్యాడ్ కెప్టెన్ ఉన్నాడు. తన ఆట తీరుతో టీ20 ప్రపంచకప్ 2022 నుంచి పాక్ నిష్క్రమించింది. మనం ఇటీవల ఓడిన మ్యాచ్‌ల్లో మొహ్మద్ నవాజ్ చివరి ఓవర్ వేశాడు. పాకిస్తాన్ కెప్టెన్సీ, మెనేజ్‌మెంట్ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి' అని షోయబ్ అక్తర్ అన్నాడు.
షోయబ్ అక్తర్ కేవలం పాకిస్తాన్ జట్టుపైనే కాదు టీమిండియా కూడా బోల్డ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా 'టీస్ మార్ ఖాన్ ఏం కాదు' అని, టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ నుంచి నిష్క్రమిస్తుందని జోస్యం చెప్పాడు. అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'టోర్నీ మొదటి వారంలోనే పాకిస్థాన్ ఔట్ అవుతుందని ముందే ఊహించాను. వచ్చే వారం భారత్ కూడా నిష్క్రమిస్తుంది. టీమిండియా సెమీస్ ఆడవచ్చు అంతే. టీమిండియా టీస్ మార్ ఖాన్ ఏం కాదు' అని అక్తర్ పేర్కొన్నాడు.
Also Read: కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య ఫైట్.. చివరికి ఏది గెలిచిందంటే? ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Also Read: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook