Danish Kaneria Feels Suryakumar Yadav Can Beat Virat Kohli and Babar Azam: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంలో టీమిండియా స్టార్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో కేవలం 36 బంతుల్లో 69 పరుగులతో రాణించి.. భారత్‌కు విజయాన్ని దగ్గర చేశాడు. అద్భుతంగా ఆడిన సూర్యను పలువురు మాజీలు అభినందిస్తున్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు.
సూర్యకుమార్ యాదవ్ అందరినీ అధిగమించి ఆల్‌టైం గ్రేటెస్ట్ బ్యాటర్‌గా ఎదుగుతాడని డానిష్ కనేరియా అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో కనేరియా మాట్లాడుతూ... 'సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాటర్. భిన్నమైన శైలితో ఆడతాడు. 360 డిగ్రీల్లో షాట్లు ఆడగలడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో అత్యద్భుతంగా ఆడాడు. కచ్చితంగా సూర్య చాలా పెద్ద స్టార్ అవుతాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం దిగ్గజాలను మైమరపించేలా ఉంది. విరాట్ కోహ్లీ ఎన్నో పరుగులు చేస్తాడు, బాబర్ ఆజామ్ విజయవంతమవుతాడు. కానీ సూర్య అందరినీ వెనక్కినెడతాడు' అని చెప్పాడు.
'మూడో టీ20లో ఆడమ్ జంపాకి విరాట్ కోహ్లీ దొరికిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడిని కోహ్లీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ త్వరగా ఔటైన తర్వాత సూర్యకు మార్గనిర్దేశం చేస్తూ.. మ్యాచ్‌ను ముందుకు నడిపించాడు. కోహ్లీ, సూర్య ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ ఇద్దరు ఇలాగే ఆడితే టీ20 ప్రపంచకప్ 2022లో అన్ని జట్లపై భారత్ ఆధిపత్యం చలాయిస్తుంది' అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.
Also Read: 'మీషో'లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెడితే.. వచ్చింది ఏంటో తెలిస్తే షాకే! డెలివరీ బాయ్‌ని పట్టుకుని
Also Read: Free Ration Scheme: పేదలకు గుడ్‌న్యూస్..ఉచిత రేషన్ పంపిణీ ఎప్పటి వరకంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook