Ind vs Pak: హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు, టీ20ల్లో వేయి పరుగులు, 50 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్

Ind vs Pak: టీ20 ప్రపంచకప్ 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు సృష్టించాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా రికార్డు నెలకొల్పాడు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2022, 06:26 PM IST
Ind vs Pak: హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు, టీ20ల్లో వేయి పరుగులు, 50 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 లో తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా దాయాది పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్ కం బౌలర్ హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు సాధించాడు.

ఇండియన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 1000 పరుగులు, 50 వికెట్లు సాధించిన తొలి ఇండియన్‌గా అరుదైన ఖ్యాతి సాధించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ స్డేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది.

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా..హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్ వికెట్లను పడగొట్టాడు. ఫలితంగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులే చేయగలిగింది. నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా 6.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి..31 పరుగులే చేసింది. విరాట్ కోహ్లీతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 37 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌కు టీమ్ ఇండియా పేస్ బౌలర్లతో ఇబ్బంది కలిగింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్ ఇద్దరూ ప్రారంభంలోనే వెనుదిరిగారు. షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ కలిసి పాక్ ఇన్నింగ్స్ నిలబెట్టారు. 

Also read: Virat Kohli: నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్.. ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News