ICC Under 19 World Cup 2024, India vs Ireland Highlights: అండర్ – 19 వరల్డ్ కప్‌లో టీమిండియా రెండో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటైన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది యువ భారత్. ఈ విజయంతో పాయింట్ల పట్టికలోని గ్రూప్- ఎలో భారత్ అగ్రస్థానంలో ఉంది. టీమిండియా తన తర్వాత మ్యాచ్ ను ఈనెల 28న యూనైటెడ్ స్టేట్స్‌తో ఆడనుంది. ఈ విజయంతో భారత్ సూపర్ సిక్స్ బెర్త్ ఖాయమైంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 301 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (118) సెంచరీతో మెరిశాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆ జట్టు 29.4 ఓవర్లలో వంద పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత యువ పేసర్ నమన్ తివారి నాలుగు వికెట్ల (4/53) తీయగా.. స్పిన్నర్ సౌమీ పాండే మూడు వికెట్లు (3/21) పడగొట్టాడు. శతకం సాధించిన ముషీర్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..
భారీ ఛేజింగ్ ను ప్రారంభించిన ఐర్లాండ్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జోర్డాన్ నీల్ (11)ను సౌమీ పాండే బౌల్డ్ చేయడంతో ప్రారంభమైన ఐర్లాండ్ వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ ర్యాన్ హంటర్ (13) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యారు. దీంతో ఆ టీమ్ 50 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందోమోనని అంతా అనుకున్నారు. కానీ లోయరార్డర్ బ్యాటర్లు ఒలీవర్ రిలే (15), డేనియల్ ఫార్కిన్ (27 నాటౌట్) కాస్త ప్రతిఘటించడంతో ఐర్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి