బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు టీమిండియా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (80; 156 బంతుల్లో 9×4).. బెయిర్‌స్టో (70; 88 బంతుల్లో 9×4), జెన్నింగ్స్ (42; 98 బంతుల్లో 4×4) లతో చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివరి సెషన్లో భారత్ ఆరు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ పరిస్థితి తల్లకిందులైంది. కుర్రన్ (24), అండర్సన్ (0) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు, షమీ 2 వికెట్లు, ఉమేష్, ఇశాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం.
Beautiful Delivery by Ashwin to remove Cook #EngvInd pic.twitter.com/gagtSJGn39
— Sam (@Ashnasami) August 1, 2018
That's Stumps on Day 1 of the 1st Test.
England 285/9. A four wicket haul for @ashwinravi99#ENGvIND pic.twitter.com/Ty2FhiFHRr
— BCCI (@BCCI) August 1, 2018
జో రుట్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ ఆడుతున్న 1000వ టెస్టులో ఆ జట్టు కెప్టెన్ జో రుట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆరువేల పరుగులు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (27 ఏళ్ల 214 రోజులు)ల్లో మూడో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ (26 ఏళ్ల 213 రోజులు), అలిస్టన్ కుక్(7 ఏళ్ల 43 రోజులు)ఉండగా.. అరంగేట్రం చేసిన అతి తక్కువ రోజుల్లో(2058) ఆరువేల పరుగులు చేసింది మాత్రం రూట్ ఒక్కడే. కాగా ఈ మ్యాచ్‌లో 80 పరుగుల వద్ద రూట్ ఔటయ్యాడు.
పుజారాపై వేటు
ఇంగ్లండ్, భారత్ మధ్య తొలిటెస్టుకు చెతేశ్వర్ పుజారా స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయడంపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కౌంటీల్లో పుజారా పేలవ ప్రదర్శన చేసిన నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లీష్ గడ్డపై అనుభవజ్ఞుడిని పక్కనబెట్టి ధావన్, దినేష్, రాహుల్ వంటి వారిని ఎంపిక చేయడం కోహ్లీకి సరికాదని విమర్శిస్తున్నారు. పుజారాతో టీమిండియా టెస్టు ట్రాక్ రికార్డులను ట్వీట్ చేస్తున్నారు.