IND vs AUS Live Updates: ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. స్టార్ ప్లేయర్‌కు నో ప్లేస్.. తుది జట్లు ఇవే..

India Vs Australia WTC Final 2023 Updates Toss and Playing 11: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండడంతో ఒక స్పిన్నర్‌తోనే భారత్ బరిలోకి దిగింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 7, 2023, 03:02 PM IST
IND vs AUS Live Updates: ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. స్టార్ ప్లేయర్‌కు నో ప్లేస్.. తుది జట్లు ఇవే..

India Vs Australia WTC Final 2023 Updates Toss and Playing 11: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 పోరు మొదలైంది. టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగబోతుంది. గత పదేళ్లు ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజయం సాధించి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని చూస్తోంది. చివరగా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఐసీసీ టోర్నీని గెలిచేందుకు టీమిండియా పోరాడుతోంది. చివరగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్నా.. న్యూజిలాండ్ టీమ్ దెబ్బకొట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా ఎలాగైనా కప్ కొట్టాలని రెడీ అయింది. అటు కంగారూ టీమ్‌ కూడా పటిష్టంగా ఉండడంతో పోరు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలించిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. 

ఓవల్ పిచ్‌పై పచ్చిక కనిపిస్తుండడంతో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే వాతావరణం బట్టి ఫ్లాట్‌గా మారితే.. బ్యాట్స్‌మెన్ సులభంగా పరుగులు చేయవచ్చు. మూడో రోజు నుంచి పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకుంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 106 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియాదే 44 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. టీమిండియా 32 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 29 టెస్టులు డ్రాగా ముగియగా.. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. నేటి నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.

 

 

 

 

పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండడంతో రెండు జట్లు నలుగురు పేసర్లతో బరిలోకి దిగాయి. రవిచంద్రన్ అశ్విన్‌కు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తుదిజట్టులో చోటు కల్పించింది. నాథన్ లయోన్ ఆసీస్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు.

"మేము బౌలింగ్ చేయబోతున్నాం. కేవలం పరిస్థితులు, వాతావరణం కూడా మేఘావృతమై ఉండంతో మే ఫీల్డింగ్ చేస్తాం. పిచ్ మరీ ఎక్కువగా మారుతుందని అనుకోను. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడుతున్నాం. జడేజాను జట్టులోకి తీసుకున్నాం. అశ్విన్‌ను పక్కనపెట్టడం ఎప్పుడూ కఠినమైనదే. అశ్విన్ చాలా ఏళ్లు మా టీమ్‌కు విన్నర్‌గా ఉన్నాడు. కానీ మీరు జట్టు కోసం తప్పలేదు. చివరికి మేము ఆ నిర్ణయానికి వచ్చాము. రహానే అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది. కొంతకాలం తరువాత జట్టులోకి తిరిగి వచ్చాడు. జట్టు కోసం ఎంతో చేశాడు.." అని టాస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.

 

Also Read:  Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్

తుది జట్లు ఇలా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

 

Also Read:  IND vs AUS WTC Final 2023: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్.. తుది జట్లు ఇవే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News