Ind vs Aus WTC Final Highlights: ఫైనల్ టెస్ట్‌లో ఆసీస్ జోరు.. తొలి రోజు రోహిత్ శర్మ చేసిన మూడు తప్పులు ఇవే..!

Ind Vs Aus WTC Final 2023 Day 1 Updates: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవాలన్న టీమిండియా ఆశలకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ అడ్డుకట్ట వేస్తున్నారు. తొలి రోజు మొదట గంట ఆధిపత్యం ప్రదర్శించిన భారత బౌలర్లు ఆ తరువాత పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పులు కూడా ఆసీస్‌కు కలిసి వచ్చాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 8, 2023, 01:11 PM IST
Ind vs Aus WTC Final Highlights: ఫైనల్ టెస్ట్‌లో ఆసీస్ జోరు.. తొలి రోజు రోహిత్ శర్మ చేసిన మూడు తప్పులు ఇవే..!

Ind Vs Aus WTC Final 2023 Day 1 Updates: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఆరంభించిన కంగారూ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల కోల్పోయి 327 రన్స్ చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (156 బంతుల్లో 146 నాటౌట్,  22 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్‌ స్మిత్‌ (227 బంతుల్లో 95 నాటౌట్, 14 ఫోర్లు) రాణించడంతో పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు కంగారూ బ్యాట్స్‌మెన్ జోరుకు కళ్లెం వేయకుంటే.. టీమిండియా చేతిలో నుంచి మ్యాచ్ చేజారిపోయినట్లే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ఆ నిర్ణయాలు ఏంటంటే..?

రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం..

టీమిండియా టాప్ క్లాస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చెత్తో మలుపు తిప్పాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌కు అశ్విన్‌ను దూరం పెట్టడంపై మాజీలు విమర్శలు చేస్తున్నారు. అశ్విన్‌ను కాదని.. జడేజాను ప్రధాన స్పిన్నర్‌గా టీమ్‌లోకి తీసుకున్నారు. జడేజాకు విదేశాల్లో అంత మంచి రికార్డు కూడా లేదు. 

బ్యాటింగ్ కోసం అనుకుంటే.. జడేజా స్థాయిలో కాకపోయినా అశ్విన్‌కు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది. మరో ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌ కూడా జట్టులో ఉండడంతో బ్యాటింగ్ పరంగా ఎలాంటి సమస్య లేదు. ఈ లెక్కలో జడేజా ప్లేస్‌లో అశ్విన్‌కు అవకాశం ఇచ్చి ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ అభిప్రాయపడుతున్నారు. అశ్విన్ తన ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, దూస్రా, క్యారమ్ బాల్ వంటి డిఫరెంట్ బాల్స్‌తో ఇబ్బంది పెట్టగలడు. స్మిత్-ట్రావిస్ హెడ్ జోడిని విడగొట్టేందుకు బౌలర్లు ఎంత శ్రమించినా.. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
 
ఫీల్డింగ్ ఎంచుకోవడం..

టాస్ సమయానికి ఆకాశం మేఘావృతమై ఉంది. పిచ్‌పై పచ్చిక కూడా ఉండడంతో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడగా.. కాసేపటికే పరిస్థితులు మారిపోవడంతో తలకిందులైంది. ఓవల్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకున్నారు. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ 370 బంతుల్లో నాలుగో వికెట్‌కు అజేయంగా 251 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. తిరుగులేని స్థితికి చేరుకుంది. 

నలుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకోవడం.. 

పిచ్ పేసర్లను అనుకూలించే అవకాశం ఉంటుందనే అంచనాతో రోహిత్ శర్మ నలుగురు ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు చోటు కల్పించాడు. అయితే కంగారూ బ్యాట్స్‌మెన్.. స్పిన్ కంటే ఫాస్ట్ బౌలింగ్‌ను బాగా ఆడతారు. ఆసీస్ పిచ్‌లన్నీ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగానే ఉంటాయి. దీంతో టీమిండియాలో నలుగురు పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే కాస్త ఆచితూచి ఆడారు. మహ్మద్ షమీ, సిరాజ్ నిప్పులుచెరిగే బంతులతో భయపెట్టినా.. ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ పూర్తిగా తేలిపోయారు. భారత బౌలింగ్ అటాక్ పూర్తిగా తేలిపోవడంతో స్మిత్, హెడ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 

Also Read: Railway recruitment 2023: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.1,40 వేల వరకు జీతం.. అర్హత వివరాలు ఇవే..!

Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News