IND vs AUS 2nd T20 Updates: ఆసీస్ బౌలర్లపై టీమిండియా ఊచకోత.. కంగారూలకు భారీ టార్గెట్

India Vs Australia 2nd T20 1st Innings Updates: ఆసీస్‌ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఊచకోత కోశారు. ఆశాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వచ్చిన వచ్చినట్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా ముందు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 26, 2023, 09:30 PM IST
IND vs AUS 2nd T20 Updates: ఆసీస్ బౌలర్లపై టీమిండియా ఊచకోత.. కంగారూలకు భారీ టార్గెట్

India Vs Australia 2nd T20 1st Innings Updates: ఆస్ట్రేలియా బౌలర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై చెలరేగి బ్యాటింగ్ చేశారు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (53), ఇషాన్ కిషన్ (52), రుతురాజ్ గైక్వాడ్ (58) అర్ధ సెంచరీలకు తోడు చివర్లో రింకూ సింగ్ (31) మెరుపులు తోడవ్వడంతో భారీ స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు తీసుకోగా.. స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు. 236 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగనుంది. 

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తప్పని ఆరంభంలోనే టీమిండియా ఓపెనర్లు నిరూపించారు. ఓ ఎండ్‌లో రుతురాజ్ యాంకర్ రోల్ ప్లే చేయగా.. యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడాడు. 25 బంతుల్లో  9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసిన జైస్వాల్‌ను ఎల్లిస్ ఔట్ చేసి ఆసీస్‌కు తొలి వికెట్ అందించాడు. దీంతో రుతురాజ్-జైస్వాల్ జోడి 5.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అనంతరం ఇషాన్ కిషన్ కూడా అదే జోరును కంటిన్యూ చేశాడు.

32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి ఇషాన్ ఔట్ అయ్యాడు. 164 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. రుతురాజ్‌తో కలిసి 58 బంతుల్లో 87 పరుగులు జోడించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19, 2 సిక్సర్లు) దూకుడు ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. ఆ తరువాత రింకూ సింగ్  9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ 2 బంతుల్లో 1 సిక్స్ సాయంతో 7 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. గత మ్యాచ్‌లో చివర్లో మెరుపులు మెరిపించి జట్టును గెలిపించిన రింకూ సింగ్.. ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. తొలి బంతినే వేగంగా ఆడుతూ భారీ స్కోరు సాధించడంతో కీ రోల్ ప్లే చేశాడు.

Also Read: IPL 2024 Trading Window Live Updates: ఐపీఎల్‌ పూర్తి జట్ల వివరాలు ఇవే.. ఏ జట్టులో ఏ ప్లేయర్ అంటే..?

Also Read: RCB Retain List: వ్యాలెట్ పెరగాలంటే వేటు తప్పదు, 11 మందిని వదిలించుకున్న ఆర్సీబీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News