IND Vs AUS 2nd ODI Updates: రెండో వన్డే నుంచి కెప్టెన్ ఔట్.. భారత్‌దే బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!

Australia Won The Toss Elected to Bowl First Against India: రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన స్మిత్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా స్టార్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫ్యామిలీతో గడిపేందుకు వెళ్లగా.. ప్రసిద్ధ్ కృష్ణను తుదిజట్టులోకి తీసుకుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 24, 2023, 02:51 PM IST
IND Vs AUS 2nd ODI Updates: రెండో వన్డే నుంచి కెప్టెన్ ఔట్.. భారత్‌దే బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!

Australia Won The Toss Elected to Bowl First Against India: వరల్డ్ కప్‌కు ముందు సిరీస్‌ను గెలవాలని భారత్.. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా రెండో వన్డేలో సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. సిరీస్‌తోపాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ టీమ్‌గా వరల్డ్ కప్‌లో అడుగుపెడుతుంది. ఆస్ట్రేలియా గెలిస్తే.. సిరీస్‌ సమం అవుతుంది. ఇక ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ దూరమవ్వడంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట ఇన్నింగ్స్ ఆరంభించిననున్న భారత్.. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కంగారూల జట్టుకు ఎంత టార్గెట్ విధిస్తుందో చూడాలి. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌ నుంచి రెస్ట్ తీసుకోవడంతో.. ప్రసిద్ధ్‌ కృష్ణను తుది జట్టులోకి తీసుకున్నారు. ఆసీస్ కూడా తుది జట్టులో మార్పులు చేసింది. 

టాస్ గెలిచిన స్టీవ్ స్మీత్ మాట్లాడుతూ.. "మేము బౌలింగ్ చేస్తాం. ఇక్కడ చాలా వేడిగా ఉంది. చక్కటి వికెట్. ఫాన్సీ ఛేజింగ్ కనిపిస్తోంది. మంచు కురిస్తే.. మాకు సహకరిస్తుంది. మేము వరల్డ్ కప్ దిశగా పనిచేయడం ముఖ్యం. మేము ఈ మ్యాచ్‌ గెలవాలనుకుంటున్నాం.  మొన్న రాత్రి భారత్ బాగా ఆడింది. తిరిగి పుంజుకోవడానికి మాకు మంచి అవకాశం. జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. స్పెన్సర్ జాన్సన్ అరంగేట్రం చేశాడు. జోష్ హేజిల్‌వుడ్, అలెక్స్ కారీ కూడా తిరిగి వచ్చాడు.." అని తెలిపాడు.

"గ్రౌండ్‌ను చూసి.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం. మంచి వికెట్. భారీ స్కోరును బోర్డుపై ఉంచడం మాకు సవాలు. కీ ప్లేయర్లు విశ్రాంతి తీసుకున్నారు. గత మ్యాచ్‌తో పోలిస్తే మాకు ఒకే ఒక్క మార్పు ఉంది. జస్రీత్‌కు విశ్రాంతి లభించింది. ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. మిడిల్ ఆర్డర్‌కి పరీక్ష జరగడం మంచిది. ఆసియా కప్‌లో కూడా మాకు సవాలు ఎదురైంది. మధ్యలో కొంత సమయం గడపడం మా బ్యాటర్లందరికీ మంచిది. ఇది పెద్ద టోర్నీకి వెళ్లేందుకు మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.." అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

ప్లేయింగ్11 ఇలా..

భారత్: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరున్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.

Trending News