IND Vs AFG Full Highlights: ఏం మ్యాచ్‌ రా అయ్యా.. నరాలు కట్ అయ్యాయి.. రెండో సూపర్ ఓవర్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

India vs Afghanistan 3rd T20 Highlights: ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై రెండో సూపర్‌లో భారత్ 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట రెండు జట్లు 212 పరుగులు చేయగా.. అనంతరం సూపర్‌ ఓవర్‌లో కూడా సమానంగా 16 పరుగులే చేశాయి. రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 11 రన్స్ చేయగా.. అఫ్గాన్‌ జట్టు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 18, 2024, 04:32 PM IST
IND Vs AFG Full Highlights: ఏం మ్యాచ్‌ రా అయ్యా.. నరాలు కట్ అయ్యాయి.. రెండో సూపర్ ఓవర్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

India Vs Afghanistan 3rd T20 Highlights: క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్‌.. ఒకటి కాదు.. రెండో సూపర్లు జరిగిన మ్యాచ్‌.. యావత్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌.. చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను రేపిన మ్యాచ్‌.. భారత్-అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగింది. రెండో సూపర్‌లో భారత్ 10 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను ఓడించి.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌కు సూపర్ ఓవర్‌కు దారి తీసింది. 

తొలి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు చెరో 16 పరుగులు చేయండంతో మరోసారి మ్యాచ్‌ను టై అయింది. దీంతో ఫలితం కోసం రెండో సూపర్ ఓవర్‌ నిర్వహించగా.. మొదట భారత్ బ్యాటింగ్‌కు భారత్ 11 పరుగులు చేసింది. ఆ తరువాత అఫ్గాన్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.  రెండో సూపర్‌ ఓవర్‌లో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి జట్టను గెలిపించాడు. 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 121, 11 ఫోర్లు, 8 సిక్సర్లు), రింకూ సింగ్ (39 బంతుల్లో 69, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 4.3 ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో వీరిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), శివమ్‌ దూబె (1), కోహ్లీ, సంజు శాంసన్‌ డకౌట్‌ అయ్యారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరీద్‌ 3 వికెట్లు తీయగా.. ఒమర్జాయ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.  

213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (50), ఇబ్రహీం జద్రాన్ (50) 11 ఓవర్లలోనే 93 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. గుల్బాదిన్ నైబ్ (55 నాటౌట్), మహ్మద్ నబి (34) దూకుడుగా ఆడడంతో 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్‌లకు చెరో వికెట్ దక్కింది. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకు దక్కగా.. మ్యాన్ ఆఫ్ సిరీస్‌ను శివమ్ ధూబే గెలుచుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియాకు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఐపీఎల్ తరువాత నేరుగా వరల్డ్ కప్‌కు సిద్ధం అవుతుంది. 

Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News