Shoaib Akthar: 'అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓడిపోతే..చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్'..

Shoaib Akhtar: ఆదివారం జరిగే అఫ్గాన్‌-కివీస్ పోరుపై పాక్ మాజీ బౌరల్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోతే తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముందని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 08:32 PM IST
Shoaib Akthar: 'అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓడిపోతే..చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్'..

Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్‌ కప్(T20 World Cup 2021)లో భాగంగా... గ్రూప్‌-2 నుంచి ఇప్పటికే పాకిస్థాన్‌(Pakistan) నాలుగు విజయాలతో సెమీస్‌ బెర్తు(Semis Race) ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన స్థానం కోసం భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ పోటీపడుతున్నాయి. అయితే, ఆదివారం అఫ్గాన్‌ - న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో కివీస్‌(New Zealand) గెలిస్తే అది నేరుగా సెమీస్‌ చేరుతుంది..ఒక వేళ అఫ్గాన్‌ గెలిస్తే ఆ జట్టుతో పాటు టీమ్‌ఇండియాకు అవకాశాలు ఉన్నాయి.

 ఈ నేపథ్యంలో అక్తర్‌ తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ...''అఫ్గాన్‌(Afghanistan)తో పోరులో కివీస్‌ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్‌ అభిమానులు ఊరుకోరని.. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేయడమే పనిగా పెట్టుకుంటారని'' అన్నాడు. ఇక టీమ్‌ఇండియా(Teamindia) పుంజుకోవడంపై స్పందిస్తూ.. కోహ్లీసేన ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడంతో టోర్నీ ఆసక్తిగా మారిందని చెప్పాడు. ఒకవేళ టీమ్‌ఇండియా సెమీస్‌ చేరితే ఆపై ఫైనల్లో పాకిస్థాన్‌తో మరోసారి తలపడే అవకాశం ఉందన్నాడు. టీమ్‌ఇండియా బాగా ఆడిందని, కాకపోతే కాస్త ఆలస్యంగా రాణించిందని పాక్ మాజీ పేసర్‌ పేర్కొన్నాడు. 

Also read: T20 World Cup 2021: వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ

టీమ్‌ఇండియా ఈ ప్రపంచకప్‌ టోర్నీలో తొలుత పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే, మూడో మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 66 పరుగుల భారీ తేడాతో గెలవడంతో ఆ మ్యాచ్‌ను భారత్‌ ఫిక్స్‌ చేసిందని పాకిస్థాన్‌ అభిమానులు ట్విటర్‌(Twitter)లో విస్త్రుత ప్రచారం చేశారు. దీంతో ఆ రోజంతా అది ట్రెండింగ్‌లో నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌.. అఫ్గాన్‌ చేతిలో ఓడితే మళ్లీ అలాంటి పోస్టులే వైరల్‌ అవుతాయని అక్తర్‌ తన సందేహం వ్యక్తం చేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News