Team india Emotion: ప్రపంచకప్ 2023లో చివరి వరకూ అప్రతిహంగా ఓటమి లేకుండా సాగిన టీమ్ ఇండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అంతవరకూ అద్భుతంగా ఆడినా కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి చెందింది. 12 ఏళ్ల తరువాత కప్ వచ్చేస్తుందనుకున్న ఆశలు నీరుగారిపోయాయి.
ప్రపంచకప్ 2003 ఫైనల్ ఓటమి ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు 2023 అదే ప్రత్యర్ధి చేతిలో ఓటమి పాలవడాన్ని టీమ్ ఇండియాతో పాటు క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కష్టపడి ప్రతి మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా చివర్లో తడబడిపోయింది. కచ్చితందా కప్ సాధిస్తామనే నమ్మకంతో బరిలో దిగిన టీమ్ ఇండియా ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. టైటిల్ మ్యాచ్ బ్యాటర్లు విఫలం కావడంతో టీమ్ ఇండియా స్వల్ప లక్ష్యమే విధించగలిగింది. అదే ఇండియా పరాజయానికి కారణమైంది. మెగా టోర్నీ కప్ ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.
ఈ ప్రపంచకప్‌లో సెమీస్ సహా 10 మ్యాచ్‌లు వరుసగా గెలుస్తూ చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో టీమ్ ఇండియా అభిమానుల కంటే ఆటగాళ్లకు ఎక్కువ షాక్ తగిలింది. అప్పటి వరకూ అద్బుత ప్రదర్శన చూపించిన తాము చివర్లో ఎలా తడబడ్డామో తెలియక బాధను దిగమింగుకోలేక వచ్చే కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. కెమేరాల సాక్షిగా టీమ్ ఇండియా ఆటగాళ్లలో ఆవేదన స్పష్టంగా కన్పించింది. నిరాశతో ముఖాలు వడలిపోయాయి.
మ్యాచ్ ముగిశాక వెనుదిరిగి వెళ్తున్న రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. అటు విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్ చాలా ఎమోషనల్‌గా కన్పించారు. విరాట్ కోహ్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి. మొహమ్మద్ సిరాజ్ కళ్లలో నీరు ఆగనే ఆగలేదు. టీ షర్టుతో కన్నీళ్లు తుడుచుకుంటూ కన్పించాడు. రోహిత్, విరాట్ కోహ్లీలకు ఇదే చివర్ ప్రపంచకప్ కావడంతో మరింత ఆవేదన చెందుతున్నారు.
ఫైనల్ టోర్నీలో ఓడినా టాప్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ, టాప్ బౌలర్‌గా మొహమ్మద్ షమీ నిలిచారు. టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శనకు ఇదే నిదర్శనం.
Also read: India Vs Australia Highlights: ఫైనల్ ఫైట్‌లో టీమిండియా బోల్తా.. విశ్వవిజేతగా ఆసీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook