Ahmedabad Pitch: ప్రపంచకప్ ఫైనల్‌కు ఎలాంటి పిచ్ సిద్దమౌతోంది, అహ్మదాబాద్ పిచ్ ఎవరికి అనుకూలం

Ahmedabad Pitch: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ఇంకా ఒక్కరోజే మిగిలింది. 12 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా తిరిగి పైనల్‌లో అడుగుపెట్టింది. కంగారూలను ఓడించి మూడవసారి కప్ సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంది, ఎవరికి అనుకూలమనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2023, 10:00 AM IST
Ahmedabad Pitch: ప్రపంచకప్ ఫైనల్‌కు ఎలాంటి పిచ్ సిద్దమౌతోంది, అహ్మదాబాద్ పిచ్ ఎవరికి అనుకూలం

Ahmedabad Pitch: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో నవంబర్ 19న ఐపీసీ ప్రపంచకప్ తుది సమరం జరగనుంది. రెండు సార్లు టైటిల్ సాధించిన టీమ్ ఇండియా వర్సెస్ ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్‌లో పిచ్ కీలకపాత్ర పోషించనుంది. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగిన వాంఖడే పిచ్ చుట్టూ వివిధ రకాల వివాదాలు చుట్టుముట్టాయి. కొత్త పిచ్ కాకుండా పాత పిచ్ సిద్ధం చేశారనే విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి రేగుతోంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా లేక బౌలింగ్‌కు అనువుగా ఉంటుందా అనేది తెలుసుకుందాం.

నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. అన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వీటిలో ఐదు పిచ్‌లు నల్ల మట్టితో తయారు చేయగా ఆరు పిచ్‌లను ఎర్రమట్టితో తయారు చేశారు.ఫైనల్ మ్యాచ్ ఈ రెండు రకాల పిచ్‌లలో ఏది ఎంపిక చేస్తారో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ నల్లమట్టి పిచ్ ఎంపిక చేస్తే బంతి కాస్త బౌన్స్ అవుతుంది. దాంతో బౌలర్లకు అనుకూలించవచ్చు. ఫైనల్ వంటి మెగా ఈవెంట్లకు నల్లమట్టి పిచ్‌నే ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే నల్లమట్టి పిచ్‌లో స్పిన్‌కు అనుకూలించే వికెట్ సిద్ధం చేస్తున్నారనే సమాచారం అందుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సెమీస్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడంతో ఆసీస్ బ్యాటర్లు చాలా తడబడ్డారు. స్పిన్ వికెట్ సిద్ధమైతే కచ్చితంగా టీమ్ ఇండియాకు లాభించనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జంపా తప్ప సరైన స్పిన్నర్లు లేరు. 

అహ్మదాబాద్ పిచ్ ఇప్పటి వరకూ ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సహకరించింది. నాలుగ మ్యాచ్‌లు జరిగితే మూడు సార్లు ఛేజింగ్ జట్టు గెలిచింది. ఇక నాలుగు మ్యాచ్‌లలో ఏ జట్టూ 300 పరుగులు దాటలేదు. ఈ ప్రపంచకప్‌లో ఈ పిచ్‌పై అత్యధిక స్కోరు 286 ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చేసింది. మొదటి మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్‌లో ఇంగ్లండ్ 282 పరుగులు చేసినా కివీస్ జట్టు కేవలం 1 వికెట్ కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్‌లో పాక్ 191 పరుగులకే కుప్పకూలగా, ఇండియా ఆ లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించింది. 

ఇక ఈ పిచ్ పేసర్లకు కూడా చాలా బాగానే సహకరించిందని చెప్పాలి. నాలుగు మ్యాచ్‌లలో 57 వికెట్లు పడగా అందులే 36 వికెట్లు పేసర్లకే లభించాయి. అయితే ఇప్పుడు ఫైనల్ కోసం పాత్ పిచ్ వినియోగిస్తారా లేక కొత్త పిచ్ సిద్ధం చేస్తారా అనేది ఇంకా తెలియదు. 

Also read: IND vs AUS Final Win Prediction: ప్రపంచకప్ విజేత ఎవరో చెప్పేసిన ప్రముఖ జ్యోతిష్యుడు.. టీమిండియా జాతకం ఎలా ఉందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News