ICC Announces Mens ODI Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2022 సంవత్సరానికి గానూ పురుషుల అత్యుత్తమ వన్డే జట్టును మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజామ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. 2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేశామని ఐసీసీ పేర్కొంది. ఈ జట్టులో భారత్ నుంచి కేవలం ఇద్దరు ప్లేయర్‌లకు మాత్రమే చోటు దక్కింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో చోటు దక్కలేదు. అలానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు కూడా చుక్కెదురైంది. శ్రేయస్ అయ్యర్ 2022లో నిలకడగా ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. 17 మ్యాచ్‌లలో 724 రన్స్ చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. 2022లో మొహ్మద్ సిరాజ్ ఆడిన 15 మ్యాచ్‌లలో మొత్తంగా 4.62 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు.
ఐసీసీ వన్డే జట్టుకు ఓపెనర్లుగా బాబర్ ఆజామ్, ట్రవిస్ హెడ్ ఎంపికవగా.. వన్‌డౌన్‌లో షాయీ హోప్ ఎంపికయ్యాడు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో టామ్ లాథమ్ ఎంపికవగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్‌లకు ఐసీసీ చోటిచ్చింది. పేసర్ల విభాగంలో అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్ ఎంపికవగా.. స్పిన్ విభాగంలో ఆడమ్ జాంపా ఎంపికయ్యాడు.
ఐసీసీ 2022 మెన్స్ వన్డే జట్టు:
బాబర్ ఆజామ్, ట్రవిస్ హెడ్, షాయీ హోప్, శ్రేయస్ అయ్యర్, టామ్ లాథమ్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జాంపా.
ఉమెన్స్ వన్డే టీమ్:
అలీసా హీలీ, స్మృతి మందన, లౌరా వోల్వార్ట్, నాట్ స్కివర్, బెత్ మూనీ, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్, సోఫీ ఎక్లెస్టోన్, అయబొంగా ఖాకా, రేణుకా సింగ్, షబ్నిమ్ ఇస్మాయిల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.