T20 World Cup 2021: ఈ నెల అక్టోబర్ 17 వ తేదీ నుండి పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుందన్న విషయం మన అందరికి తెలిసిందే! అయితే అందరి దృష్టి భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్ పైన ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్ కు ప్రేక్షకుల కు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ, బీసీసీఐ ప్రకటించిన కొన్ని క్షణాలకే టికెట్లు అయిపోవటం చూస్తే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది.
ఇదిలా ఉండగా... పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఉన్న భారత జట్టు చాలా బలహీనంగా ఉందని, పాకిస్తాన్ టీమ్ ను ఎదుర్కొనే దైర్యం లేదని కామెంట్స్ చేసాడు. కోహ్లీ బలంపై కామెంట్స్ చేస్తూ... ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ జట్టును ఎదుర్కొనే శక్తి భారత్ కు లేకే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదని కామెంట్ చేశారు.
Also Read: Facebook, Whatsapp, Instagram Services Restored: 7 గంటల అనంతరం రీస్టోర్ అయిన సేవలు
అబ్దుల్ రజాక్ ఏఆర్వై అనే పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో.... టీమిండియా జట్టులో పాకిస్తాన్ జట్టులో ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్స్, ఆల్ రౌండర్స్ ఉన్నారా అని యాంకర్ ప్రశ్నినించాడు. దీనికి సమాధానంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రజాక్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం పాకిస్తాన్ అసమాన ప్రతిభ కలిగిన జట్టు సభ్యులతో ఉంది. హై ఓల్టేజ్ మ్యాచులలో ఆడగల సత్తా, సామర్థ్యం పాకిస్తాన్ జట్టుకు ఉంది. కానీ ఈ సామర్థ్యం టీమిండియాకు లేదు.. అక్టోబర్ 24 న జరగబోయే టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా జట్టును పాక్ టీమ్ మట్టి కురిపిస్తుంది" అని సమాధానం ఇచ్చాడు
ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చూసిన టీమిండియా అభిమానులు మరియు భారత మాజీ క్రికెటర్లు "ఎవరికీ ఎంత సామర్థ్యం ఉందో అక్టోబర్ 24 వ తేదీన దుబాయ్ మైదానంలో తేలుతుంది" అంటూ కామెంట్ చేస్తున్నారు. రికార్డ్స్ చూస్తే.. ప్రతి సారి జరిగే ఐసీసీ మ్యాచ్ లలో భారత్ ఎల్లపుడు పాకిస్తాన్ పై ఆధిపత్యం చూపిస్తుంది మరియు ఈ సారి కూడా అదే కొనసాగబోతుందని అభిమానులతో పాటు మాజీ టీమిండియా ప్లేయర్లు తెలుపుతున్నారు.
Also Read: Viral Video: నాకు కొంచెం సిగ్గెక్కువ గురూ...అందుకే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి