Hardik Pandya: భార్య Natasa Stankovic‌తో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫొటోషూట్

Photos Of Hardik Pandya With Natasa Stankovic | ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతడి భార్య, నటి నటాషా స్టాన్‌కోవిక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. భర్త హార్దిక్ పాండ్యాతో కలిసి రొమాంటిక్ ఫొటో కలెక్షన్‌ను అందిస్తుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 1, 2021, 05:26 PM IST
  • టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతడి భార్య, నటి నటాషా స్టాన్‌కోవిక్
  • కొన్ని నెలల కింద నటాషా చిన్నారి అగస్త్యకు నటాషా జన్మనిచ్చారు
  • భర్త హార్దిక్ పాండ్యాతో కలిసి రొమాంటిక్ ఫొటో కలెక్షన్‌ను అందిస్తుంది
Hardik Pandya: భార్య Natasa Stankovic‌తో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫొటోషూట్

Hardik Pandya Photos With Natasa Stankovic: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతడి భార్య, నటి నటాషా స్టాన్‌కోవిక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఫామ్‌లోకి రావడం ఏంటంటారా.. కొన్ని నెలల కింద నటాషా చిన్నారి అగస్త్యకు జన్మనిచ్చారు. ఆ తరువాత నటాషా స్టాన్‌కోవిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే కొన్ని రోజుల నుంచి భర్త హార్దిక్ పాండ్యాతో కలిసి రొమాంటిక్ ఫొటో కలెక్షన్‌ను అందిస్తుంది.

అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టుకు టీమిండియా సన్నద్దమవుతుండగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), నటాషా మాత్రం కూల్ సండే అంటూ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ లుక్‌లో కనిపించిన నటాషా, పాండ్యా ఎప్పుడు చాలా సరదాగా గడుపుతుంటారు. అందులోనూ వీరిది ప్రేమ వివాహం కనుక తమ జీవిత భాగస్వామితో గడిపేందుకు తగిన సమయాన్ని వెచ్చిస్తున్నారు.

Also Read: KTR: ఐపీఎల్ 2021 విషయంలో BCCIకి విజ్ఞప్తి చేసిన Telangana మంత్రి కేటీఆర్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__)

నటాషా స్టాన్‌కోవిక్ నల్లని చారలు ఉన్న వైట్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించింది. హార్దిక్ పాండ్యా సైతం నల్లని రంగు ప్యాంట్, జీన్స్ జాకెట్ ధరించి స్టైలిష్ లుక్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. తమ సంతోషాన్ని హ్యాపీ అండ్ కూల్ సండే అని పోస్ట్ చేశారు. 2020 జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట లాక్‌డౌన్‌లో కొందరు సన్నిహితుల మధ్య వివాహ బంధంతో నటాషా(Natasa Stankovic), హార్ధిక్ పాండ్యా ఒక్కటయ్యారు. వీరికి ఏడు నెలల బాబు అగస్త్య ఉన్నాడు. ఐపీఎల్ 2020 సమయంలో హార్ధిక్ పాండ్యా తన కుటుంబాన్ని చాలా మిస్సయ్యాడు.

Also Read: IND vs ENG 4th Test: యువరాజ్‌కు మద్దతుగా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్, ఆ ట్వీట్లపై క్లారిటీ

కాగా, తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో హార్దిక్ పాండ్యా సైతం చోటు దక్కించుకున్నాడు. నాలుగో టెస్టులో అతడు బరిలోకి దిగనున్నాడని తెలిసిందే. నాలుగో టెస్టుకు విరాట్ కోహ్లీ సేన సన్నద్ధమవుతోంది. ఎలాగైనా చివరి టెస్టులోనూ విజయం సాధించి ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తోన్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ఫైనల్ చేరుకుంది. 

Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News