దేవుడా.. ఇంత మంచి వ్యక్తిని పుట్టించినందుకు ధన్యవాదాలు: కోహ్లీకి అనుష్క బర్త్ డే విషెస్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన సతీమణి బర్త్ డే విషెస్ తెలిపారు. "దేవుడా.. ఇంత మంచి వ్యక్తిని పుట్టించినందుకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. 

Last Updated : Nov 5, 2018, 01:30 PM IST
దేవుడా.. ఇంత మంచి వ్యక్తిని పుట్టించినందుకు ధన్యవాదాలు: కోహ్లీకి అనుష్క బర్త్ డే విషెస్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన సతీమణి బర్త్ డే విషెస్ తెలిపారు. "దేవుడా.. ఇంత మంచి వ్యక్తిని పుట్టించినందుకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. ఈ సంవత్సరంతో కోహ్లీ 30 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్కతో కలిసి ఉత్తరాఖండ్‌లో ఉన్నారు. ఆయనను హరిద్వార్ ఆశ్రమానికి అనుష్క తీసుకొని వెళ్లగా.. అక్కడి ఫోటోలను కూడా ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ ఫోటోల్లో కోహ్లీ బొట్టు పెట్టుకొని మరీ కనిపిస్తారు. ఈ జంట ఉత్తరాఖండ్‌లోని పలు ఆశ్రమాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా సందర్శించారని తెలుస్తోంది.

ఇటీవలే కర్వా చౌత్ సందర్భంగా కూడా ఈ జంట తీసుకొన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ప్రస్తుత సెలబ్రీటీ జంటలలో కోహ్లీ, అనుష్క జంటకు ఒక ప్రత్యేకమైన స్థానముందని అంటూ ఉంటారు. పెళ్లి కాక ముందు వారి మధ్య ఏర్పడిన రిలేషన్ షిప్ గురించి కూడా వారి అభిమానులకు విదితమే. అనుష్కతో తన రిలేషన్ షిప్ వల్ల పలు మార్లు తాను విమర్శల పాలైనా కూడా కోహ్లీ వాటిని లెక్క చేయలేదు.

ఇటీవలే కోహ్లీ వన్డేలలో 10000 పరుగులు పూర్తిచేసుకొని సరికొత్త రికార్డును నమోదు చేశాడు. అలాగే 60 అంతర్జాతీయ శతకాలు కూడా సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టీ20ల్లో కోహ్లీ ఆడడం లేదు. అయితే నవంబరు 21 నుండి చేయనున్న ఆస్ట్రేలియా టూర్‌లో మాత్రం కోహ్లీ మళ్లీ తెరపైకి రానున్నాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటను వారి అభిమానులు విరుష్క అని అభిమానంతో పిలుచుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే.

Trending News