India vs West Indies: రేపే భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌..తుది జట్లు ఇవే..!

India vs West Indies: కరేబియన్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా టీ20 సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి నాలుగో, ఐదో మ్యాచ్‌ జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 5, 2022, 07:11 PM IST
  • కరేబియన్ గడ్డపై టీమిండియా జోరు
  • ఇప్పటికే వన్డే సిరీస్‌ కైవసం
  • రేపు నాలుగో టీ20 మ్యాచ్
India vs West Indies: రేపే భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌..తుది జట్లు ఇవే..!

India vs West Indies: అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య రేపు, ఎల్లుండి(శనివారం, ఆదివారం) నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో భారత్ ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా..రెండో టీ20లో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ మెరుపులతో భారత్ విజయ ఢంకా మోగించింది. 

ఇప్పుడు అదే ఊపును నాలుగో, ఐదో మ్యాచ్‌లో కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓ మ్యాచ్‌ గెలిచినా చాలు సిరీస్‌ దక్కుతుంది. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలిగ్ విభాగాల్లో అదుత్భంగా ఉంది. వన్డే, టీ20 సిరీస్‌లో ఇదే కనిపించింది. ఐతే రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం విఫలమయ్యింది.

టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన టీమ్‌ను మిగిలిన మ్యాచ్‌లకు కొనసాగించే అవకాశం ఉంది. మూడో మ్యాచ్‌లో కండరాల నొప్పితో రోహిత్ శర్మ మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. అతడు ఆడతాడా..లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఒక వేళ అతడు ఆడకపోతే పంత్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమంగా ఉంది. ఇటు వెస్టిండీస్‌ సైతం బలంగా కనిపిస్తోంది. 

వన్డే సిరీస్‌లో కనీసం పోటీ ఇవ్వలేకపోయినా ఆ జట్టు టీ20 సిరీస్‌లో మాత్రం పోటీనిస్తోంది. రెండో మ్యాచ్‌లో భారత్‌కు షాక్‌ను ఇచ్చింది. మూడో టీ20లోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఐతే భారత ఓపెన్ సూర్యకుమార్‌ షో ముందు ఆ జట్టు బౌలింగ్ నిలవలేకపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విండీస్‌ జట్టు గెలిస్తే సిరీస్‌ దక్కనుంది. 

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్‌ కార్తీక్, రవిచంద్ర అశ్విన్, భునేశ్వర్ కుమార్, అవేష్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్.

వెస్టిండీస్ జట్టు: కింగ్, మయర్స్, పూరన్(కెప్టెన్), హెట్‌మయిర్, థామస్, పావెల్, డ్రాక్స్, హోల్డర్, హోసెన్, జోసెఫ్‌, మెకాయ్.

Also read:AP Cets: ఏపీలో ఎడ్‌సెట్, లాసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చూడండి..!

Also read:Free Entry: హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్..ఇకపై చార్మినార్, గోల్కొండ కోటలో ఫ్రీ ఎంట్రీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News