IND vs WI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య చివరి టీ20 మ్యాచ్‌..రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఉంటుందా..?

India vs West Indies: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను తన ఖాతాల్లో వేసుకుంటోంది. ఈక్రమంలో ఇవాళ వెస్టిండీస్‌తో భారత్ చివరి టీ20 ఆడనుంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 7, 2022, 02:46 PM IST
  • టీమిండియా జైత్రయాత్ర
  • విండీస్ టూర్‌లో సిరీస్‌ల కైవసం
  • నేడే ఆఖరి టీ20 మ్యాచ్
IND vs WI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య చివరి టీ20 మ్యాచ్‌..రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఉంటుందా..?

India vs West Indies: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఫ్లోరిడా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇవాళ్టి మ్యాచ్‌ నామమాత్రంగా ఉండనుంది. ఈమ్యాచ్‌లో గెలిచి 4-1తో సిరీస్‌ను సగౌరవంగా అందుకోవాలని భారత్ భావిస్తోంది. చివరి టీ20లో రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆడని ప్లేయర్లు మైదానంలోకి దిగే సూచనలు ఉన్నాయి.

టీమిండియా మేనేజ్‌మెంట్ సైతం ఇదే భావిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. మూడో టీ20 మినహా మిగతా మ్యాచ్‌ల్లో టీమిండియా జట్టు అదరగొట్టింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హర్షల్‌ పటేల్, రవి బిష్ణోయ్‌ను ఆడించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈసిరీస్‌లో ఇషాన్ కిషన్, కూల్దీప్, హర్షల్ పటేల్ ఆడలేదు. వీరికి చివరి మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని వెస్టిండీస్ యోచిస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయింది. ఆఖరి టీ20లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని స్కెచ్‌లు వేస్తోంది. వన్డే, టీ20లో ఆ జట్టుకు ఏమి కలిసి రావడం లేదు. బ్యాటింగ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. మొదట్లో ధాటిగా ఆడినా ఓటమి తప్పడం లేదు. మూడో టీ20 మ్యాచ్‌లో మెకాయ్‌ అద్భుతం చేయడంతో విండీస్ ఘన విజయం సాధించింది. 

ఫ్లోరిడాలో జరిగే చివరి మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లను ఆడించే అవకాశం కనిపిస్తోంది. వాల్స్, సెప్టెడ్, బుక్స్, స్మిత్, పౌల్, జోసెఫ్‌ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉంది. జట్టు నిండా ఆల్‌రౌండర్లు ఉన్నా..జట్టును గెలిపించలేకపోతున్నారు. పూరన్, హోల్డర్, హెట్‌మెయిర్, పావెల్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణించారు. ఐతే వన్డే, టీ20 సిరీస్‌లో వీరంతా ఘోరంగా విఫలమయ్యారు. మొత్తంగా ఈమ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయమని విశ్లేషకులు చెబుతున్నారు. 

Also read:Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్

Also read:Rashmika Mandanna: దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక..రెమ్యునరేషన్‌ తెలుస్తే అంతా షాకే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News