IND vs SA: టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తుందా..? రేపే చివరి మ్యాచ్..!

IND vs SA: స్వదేశంలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది. ఈనేపథ్యంలో రేపు నామామాత్రపు చివరి మ్యాచ్‌ జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Oct 3, 2022, 06:02 PM IST
  • మూడు టీ20ల సిరీస్‌
  • ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్
  • రేపు చివరి మ్యాచ్
IND vs SA: టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తుందా..? రేపే చివరి మ్యాచ్..!

IND vs SA: రేపు(మంగళవారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగబోతోంది. ఇండోర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈమ్యాచ్‌ గెలిచి మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా యోచిస్తోంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఘోరంగా ఓడించిన భారత్..రెండో టీ20ల్లో అతి కష్టం మీద గెలిచింది. మూడో టీ20లోనూ ఆ జట్టును ఓడించి సిరీస్‌ను సంపూర్ణం చేయాలని టీమిండియా భావిస్తోంది.

ఇప్పటికే సిరీస్‌ భారత్‌ ఖాతాలో చేరిపోవడంతో చివరి మ్యాచ్‌లో భారీగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి. రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లు ఆడించే అవకాశం ఉంది. ఈమ్యాచ్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్‌లో భారత్‌ను కేఎల్ రాహుల్ నడిపించనున్నట్లు సమాచారం అందుతోంది. చహల్, ఉమేష్‌ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, షాబాజ్‌ అహ్మద్‌ను ఆడించే అవకాశం ఉంది.

ఈమ్యాచ్‌ తర్వాత భారత జట్టు..ఇదే జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఐతే టీ20ల్లో ఆడే ఏ ఒక్క ప్లేయర్..వన్డే సిరీస్‌లో లేరు. దీనికి పూర్తిగా యువ భారత్‌ను ఎంపిక చేశారు. ఇటు టీమిండియాను డెత్ ఓవర్ల సమస్య వెంటాడుతోంది. నిన్నటి మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌలర్ 62 పరుగులు ఇచ్చాడు. 237 పరుగులు చేసినా దానిని కాపాడుకునేందుకు భారత జట్టు చివరి దాక కష్టపడింది.

చివరకు 16 పరుగుల తేడాతో గెలిచి..సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా హాట్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో కదంతొక్కాడు. 46 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐతే చేయాల్సిన స్కోర్ అధికంగా ఉండటంతో సఫారీ జట్టు ఓటమి పాలైంది. ఐతే మూడో మ్యాచ్‌లో ఇది రిపీట్ కాకుండా చూడాలని టీమిండియా స్కెచ్‌లు వేస్తోంది. ఇటు దక్షిణాఫ్రికా జట్టు సైతం స్ట్రాంగ్‌గా ఉంది.

రెండో మ్యాచ్‌లో ఎలాగైతే పోటీ ఇచ్చామో..అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తామంటున్నారు. బౌలింగ్ పరంగా బాగా పరుగులు ఇచ్చామని..మూడో టీ20లో పుంజుకుంటామంటున్నారు. చివరి మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. నిన్నటిని టీమ్‌నే ఆడించనున్నట్లు తెలుస్తోంది. డేవిడ్ మిల్లర్ మరోమారు రెచ్చిపోతే..తమదే విజయమని కెప్టెన్ బవుమా మ్యాచ్‌ తర్వాత తెలిపారు. మొత్తంగా మూడో మ్యాచ్‌ సైతం ఆసక్తికరంగా ఉండనుంది.

Also read:CM Kcr: ఈనెల 5న గులాబీ షో..ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ..!

Also read:Hyderabad Traffic: భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News