FIFA World Cup 2022: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా దాడులు నేఫథ్యంలో.. రష్యాపై ఆంక్షలు కొరడా ఝలిపించాయి అమెరికా సహా ఐరోపాదేశాలు. రష్యా విమానాలు రాకుండా గగనతలాలను మూసివేస్తున్నాయి. అంతేకాకుండా రష్యాపై (Russia) స్విప్ట్ ప్రయోగించాయి. దీనికారణంగా రష్యా ఆర్థిక సేవలు దెబ్బతినే అవకాశం ఉంది. తాజాగా రష్యా ఫుట్‌బాల్ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా (FIFA), యూఈఎఫ్ఏ (UEFA) సంయుక్త సమావేశంలో తెలిపాయి. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించాయి.
FIFA/UEFA suspend Russian clubs and national teams from all competitions
▶️ https://t.co/Q2htzW3W9z pic.twitter.com/LFo1bUtqmm
— FIFA Media (@fifamedia) February 28, 2022
ఈ సంవత్సరం చివరలో జరగనున్న వరల్డ్ కప్‌లో (FIFA World Cup 2022) పాల్గొనేందుకు రష్యా పురుషుల జట్టు క్వాలిఫైయింగ్ ప్లే ఆఫ్ సెమీఫైనల్లో పోలాండ్‌తో మార్చి 24న తలపడనుంది. ఆ తర్వాత స్వీడన్ లేదా చెక్‌రిపబ్లిక్‌తో పోటీపడే అవకాశం ఉంది. అయితే ఈ మూడు జట్లు రష్యాతో ఆడడానికి విముఖత చూపించాయి. అంతేకాకుండా రష్యాను బహిష్కరించాలని పట్టుబట్టాయి. ఉక్రెయిన్ ప్రజల కోసం సంఘీభావంగా ఫుట్‌బాల్ ప్రపంచం ఐక్యంగా ఉందని ఫిఫా, యూఈఎఫ్ఏ ప్రకటించాయి. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని. ఫుట్‌బాల్ క్రీడ ప్రజల మధ్య శాంతి, ఐక్యత నెలకొలుపుతుందని ఆశిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ అధ్యక్షులు జియాని ఇన్ఫాంటినో, అలెగ్జాండర్ సెఫెరిన్ వివరించారు.
Also Read: IPL 2022: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి