England Test captain Ben Stokes to leave MS Dhoni Lead CSK early in IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 చివరి అంకం మ్యాచ్‌లకు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తనకు ఇంగ్లండ్ జాతీయ జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరితే ఐపీఎల్ 2023లో ఆఖరి మ్యాచ్‌లకు దూరమవుతానని స్టోక్స్ వెల్లడించాడు. ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో తాను ఐపీఎల్ 2023కి పూర్తిగా అందుబాటులో ఉండనని చెప్పకనే చెప్పాడు. ఇదే నిజమయితే చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ తగిలే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీ మొదలు కానుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 28న అజరుగుతుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నాలుగు రోజుల తర్వాత జూన్ 1 ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోయినప్పటికీ.. జూన్ 16 నుంచి ఇంగ్లీష్ గడ్డపై ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ఆరంభం అవుతుంది. ఈ సిరీస్ ఇంగ్లండ్ జట్టుకు చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే.
యాషెస్ సిరీస్ 2023 నేపథ్యంలో ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అందుకే ఇంగ్లండ్ కెప్టెన్‌ను ఈ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండమని ఈసీబీ కోరవచ్చు. అంతేకాదు కెప్టెన్ కాబట్టి స్టోక్స్ కచ్చితంగా జట్టులో ఉండాల్సిన పరిస్థితి. ఈ విషయంపై స్టోక్స్‌ను ఈసీబీ ఇప్పటివరకు సంప్రదించనప్పటికీ.. ముందుగానే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ తన ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఏదేమైనా ఈ విషయంపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. 2023 ఐపీఎల్ వేలంలో బెన్ స్టోక్స్‌ను 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీమ్:
ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌షౌ, తుషార్ దేశష్‌పాన్ పతిరానా, సిమర్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జేమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ.
Also Read: Sarah Taylor Child: మహిళా భాగస్వామితో.. బిడ్డను కననున్న మహిళా స్టార్ క్రికెటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.