ENG vs IND 5th Test, Rohit Sharma not have any injury: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్‌లోని చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ అనంతరం షెడ్యూల్ అయింది. జులై 1నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఐదవ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌లో లార్డ్స్, ఓవల్‌లో విజయం సాధించిన భారత్.. 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ భారత్ గెలిచినా లేదా డ్రా చేసుకున్నా.. సిరీస్ సొంతమవుతుంది.
ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. గురువారం ముంబై నుంచి భారత ప్లేయర్లు కొందరు ఇంగ్లండ్ బయలుదేరారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, శుభ్‌మాన్ గిల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌లు ఉన్నారు. ఓ గ్రూపుగా నిలబడి ఉన్న వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ లేడు.
రోహిత్ శర్మ ఒక్క ఫోటోలు కూడా కన్పించకపోవడంతో నెటిజన్లు పలు ట్వీట్లు చేశారు. రోహిత్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడని కొందరు, గాయపడ్డాడని మరికొందరు పేర్కొన్నారు. అయితే రోహిత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, నెట్టింట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. 5వ టెస్ట్‌కు కెప్టెన్‌గా రోహిత్ బరిలోకి దిగుతాడని, ఈ నెల 20న మిగతా భారత ఆటగాళ్లతో కలిసి ఇంగ్లండ్ వెళతాడని తెలుస్తోంది. ఇటీవలే వెకేషన్‌కు వెళ్లొచ్చిన రోహిత్.. కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడట. ఈ సిరీసులోని 4 టెస్టుల్లో రోహిత్ 368 పరుగులు చేశాడు.
5వ టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
Also Read: Sammathame Trailer: లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో గానీ.. ఈ అమ్మాయిలు తిరిగిచూసేలా లేరు!
Also Read: Viral Video: నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. మృత్యువు నుంచి తప్పించుకున్న సింహం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook