Leander Paes Rhea Pillai: మోడల్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌.. దోషిగా తేలిన లియాండర్ పేస్!!

Leander Paes and Rhea Pillai domestic violence case: భారత దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ మోడల్ రియా పిల్లైని పలు రకాలుగా గృహ హింసకు గురి చేశాడని కోర్టు తీర్పు వెల్లడించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 12:54 PM IST
  • మోడల్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌
  • దోషిగా తేలిన లియాండర్ పేస్
  • ప్రతి నెలా మెయింటెనెన్స్‌ కోసం రూ.లక్ష
Leander Paes Rhea Pillai: మోడల్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌.. దోషిగా తేలిన లియాండర్ పేస్!!

Leander Paes and Rhea Pillai domestic violence case: భారత దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ గృహహింస కేసులో దోషిగా తేలాడు. పేస్‌ తన మాజీ భాగస్వామి, మోడల్ రియా పిల్లైని పలు రకాలుగా గృహ హింసకు గురి చేశాడని ముంబై మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. దోషిగా తేలడంతో రియాకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని అతడికి కోర్టు ఆదేశించింది. ఈ నెల ప్రారంభంలో పేస్‌కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మోడల్, నటి రియా పిల్లై 2014 సంవత్సరంలో లియాండర్ పేస్‌పై గృహ హింస కేసును దాఖలు చేశారు. తాము ఎనిమిదేళ్లుగా లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, తమది పెళ్లి లాంటి బంధమే అని పేర్కొన్నారు. పేస్ తనపై పలుమార్లు గృహహింసకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. చివరకు 2022 ఫిబ్రవరి మొదటి వారంలో ముంబైలోని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెలువరించింది. పేస్ గృహహింసకు పాల్పడినట్లు రుజువైందని జస్టిస్ కోమల్‌సింగ్ రాజ్‌పుత్ పేర్కొన్నారు.

గృహ హింస నేరం రుజువైన కారణంగా రియా పిల్లైకు ప్రతి నెలా మెయింటెనెన్స్‌ కోసం రూ.లక్ష చెల్లించాలని లియాండర్ పేస్‌‌ను ముంబై కోర్టు ఆదేశించింది. ఇద్దరు కలిసి ఉంటున్న ఇంటి నుంచి రియా వెళ్లిపోవాలని అనుకుంటే..  ఇంటి అద్దె కింద మరో రూ.50 వేలు ఆమెకు ఇవ్వాలని తెలిపింది. ఒకవేళ రియా అదే ఇంట్లో ఉండాలనుకుంటే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరంభంలో కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. అవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

టెన్నిస్ స్టార్ లియాండ‌ర్ పేస్ ప్రస్తుతం బాలీవుడ్ న‌టి కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి బాహాటంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గతేడాది గోవా బీచ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. అందుకు సంబందించిన పోటోలను కిమ్ తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసింది. త‌మ మ‌ధ్య ఉంది ప్రేమ‌బంధ‌మే అని చెప్పకనే చెప్పిన ఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కుతారో లేదో చూడాలి. కిమ్ గతంలో కూడా పలువురితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. 

Also Read: Gold Rate Today 26 February 2022: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!!

Also Read: IPL 2022 Groups & Format: ఐపీఎల్ ఫార్మాట్‌లో మార్పు.. గ్రూప్-బిలో సన్‌రైజర్స్‌! ఏ జట్లతో పోటీ పడనుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News