రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం కోహ్లీకి దక్కుతుందా..లేదా?

ప్రతీ సంవత్సరం క్రీడారంగంలో విశేషంగా రాణించే ఆటగాళ్ళకు అందించే రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ఈ సంవత్సరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి దక్కే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. 

Last Updated : Aug 29, 2018, 09:44 PM IST
రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం కోహ్లీకి దక్కుతుందా..లేదా?

ప్రతీ సంవత్సరం క్రీడారంగంలో విశేషంగా రాణించే ఆటగాళ్ళకు అందించే రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ఈ సంవత్సరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి దక్కే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా పలువురి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయని వినికిడి. అందులో ముఖ్యంగా 2018 కామన్వెల్త్‌తో పాటు ఆసియా క్రీడల్లో రాణించిన క్రీడాకారుల పేర్లు వినిపించడం గమనార్హం.

కామన్వెల్త్‌‌తో పాటు ఆసియా క్రీడల్లో వరుసగా పసిడి పతకాలు కైవసం చేసుకున్న రెజ్లర్లు భజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌‌లకు కూడా ఈసారి రాజీవ్ ఖేల్ రత్న లభించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ప్రతీ సంవత్సరం హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి (ఆగస్టు 29) సందర్భంగా జాతీయ క్రీడా పురస్కారాలను ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఆసియా క్రీడలు కూడా జరుగుతుండడంతో ఈ వేడుకను సెప్టెంబరు 25 తేదికి ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో మళ్లీ రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ఎవరిని వరిస్తుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఆసియా క్రీడలు పూర్తయ్యాక.. ఆ క్రీడల్లో ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకొని అవార్డులు ప్రకటిస్తే బాగుంటుందనేది ప్రభుత్వం ఉద్దేశమని ఇప్పటికే పలు క్రీడాసంఘాలు తెలపడం గమనార్హం. ఇప్పటికే భజరంగ్ పూనియా, వినేష్ పోగట్‌తో పాటు మరికొంత మంది క్రీడాకారులు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్న విరాట్ కోహ్లీయే ఈసారి ఆ పురస్కారం అందుకొనే అవకాశం ఎక్కువశాతం ఉందని అనేకమంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Trending News