IPL 2021 Final: ఫ్యాన్స్ కు షాకిచ్చిన డేవిడ్ వార్నర్..చెన్నై జెర్సీతో నెట్టింట హల్ చల్!

CSK vs KKR: ఐపీఎల్ 2021 పైనల్ మ్యాచ్ కు ముందు డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టాలో ఓ ఆసక్తికర ఫోటో షేర్ చేశాడు. ఇంతకీ ఆ ఫోటో ఏంటి?దాని వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందామా..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2021, 06:51 PM IST
IPL 2021 Final: ఫ్యాన్స్ కు షాకిచ్చిన డేవిడ్ వార్నర్..చెన్నై జెర్సీతో నెట్టింట హల్ చల్!

IPL 2021 Final: కాసేపట్లో ఐపీఎల్ 2021(IPL 2021 Final) తుదిపోరు మెుదలుకానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR) టీంలు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశాడు. 

ఈ ఫొటోలో డేవిడ్ వార్నర్‌(david warner) చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ(CSK Jersey)తో కనిపించడం విశేషం. అలాగే తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని అభిమానులకు షాకిచ్చాడు. సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్‌ టీంల మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ సందర్బంగా ఇలా కనిపించడంతో హైదరాబాద్ అభిమానులకు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ ఫొటోకు ఫైనల్‌లో ఏ టీం గెలుస్తుందో చెప్పలేను. కానీ, ఓ అభిమాని కోరికపై ఇలా కనిపిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ అందించాడు.

Also read: IPL 2021 Final Match: ఐపీఎల్ 2021 ఫైనల్ జట్ల బలాబలాలు, పిచ్ చరిత్ర ఇలా ఉంది, టాస్ కీలకమా

ఆసీస్ స్టార్ ప్లేయర్ కొద్ది సేపటికే దీన్ని తొలగించాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో(Social Media) హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే సీజన్‌లో వార్నర్‌ సీఎస్‌కే(CSK) టీంలో చేరనున్నాడా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు బుద్ది చెప్పాటలనే ఇలా చేశాడంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్ ఘోరంగా విఫలమయ్యాడు.  దీంతో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ నుంచే కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఎస్‌ఆర్‌హెచ్ సారథ్య బాధ్యతలు చూస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News